News April 22, 2024

ఉమ్మడి విశాఖలో నేడు నామినేషన్లు వేసేది వీరే

image

➤ ఎం.శ్రీభరత్(టీడీపీ): విశాఖ ఎంపీ
➤ వంగలపూడి అనిత(టీడీపీ), కంబాల జోగులు(వైసీపీ): పాయకరావుపేట ఎమ్మెల్యే
➤ బండారు సత్యనారయణ(టీడీపీ): మాడుగుల ఎమ్మెల్యే
➤ బూడి ముత్యాలనాయుడు: అనకాపల్లి ఎంపీ
➤ గిడ్డి ఈశ్వరి(టీడీపీ): పాడేరు ఎమ్మెల్యే
➤ కొత్తపల్లి గీత(బీజేపీ): అరకు ఎంపీ
➤ రేగం మత్స్యలింగం(వైసీపీ): అరకు ఎమ్మెల్యే
➤➤ వీరితో పాటు మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులు ఈరోజు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

Similar News

News December 6, 2025

విశాఖ: క్రికెట్ ఫ్యాన్స్‌కు అలర్ట్.. ట్రాఫిక్ ఆంక్షలివే

image

భారత్-దక్షిణాఫ్రికా వన్డే సందర్భంగా విశాఖ పోలీసులు పార్కింగ్ మార్గదర్శకాలు విడుదల చేశారు. వీఐపీలు NH-16 ద్వారా నేరుగా స్టేడియానికి చేరుకోవాలి. నగరం నుంచి వచ్చే వారు సాంకేతిక కాలేజీ వద్ద, శ్రీకాకుళం వైపు నుంచి వచ్చే వారు కార్ షెడ్, మిధిలాపురి వద్ద పార్క్ చేయాలి. బీచ్ రోడ్ నుంచి వచ్చే వారికి MVV సిటీ, ఆర్టీసీ బస్సులకు లా కాలేజీ వద్ద స్థలం కేటాయించారు.

News December 6, 2025

సింహాచలం: కళ్యాణ మండపంలో తల్లి, కొడుకు ఆత్మహత్య

image

సింహాచలం కొండ కింద దేవస్థానానికి చెందిన కళ్యాణ మండపంలో తల్లి, కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. ఆధార్ కార్డు ప్రకారం గాజువాకకు చెందిన నీలావతి, అయ్యప్పంజన్‌గా గుర్తించారు. ఇద్దరూ దేవస్థానం కళ్యాణ మండపంలో గురువారం సాయంత్రం రూమ్ తీసుకున్నారు. రూములో ఉరివేసుకోవడంతో దేవస్థానం సిబ్బంది గమనించి గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ఘటనా స్థలికి చేరుకొని మృతుల కుటుంబీకులకు సమాచారం అందించారు.

News December 6, 2025

విశాఖ నుంచి వెళ్లవలసిన పలు విమానాలు రద్దు

image

విశాఖ నుండి వెళ్ళవలసిన పలు విమానాలు రద్దు అయినట్టు శనివారం ఉదయం ఇంచార్జి ఏర్పోర్ట్ డైరెక్టర్ ఎన్.పురుషోత్తం తెలిపారు. వాటిలో ఇండిగో సంస్థకు చెందిన 6E 217 / 6E 218 BLR – VTZ – BLR, 6E 5248 / 6E 845 BOM – VTZ – MAA, 6E 557 / 6E 6585 MAA – VTZ – BOM ఆపరేషన్ రీజనల్ కారణంగా రద్దయినట్లు తెలిపారు. వీటితో పాటు మరో 9 విమానాలను రద్దు చేశారు.