News September 12, 2025
ఉమ్మడి విశాఖలో రేపు లోక్ అదాలత్

ఉమ్మడి విశాఖ పరిధిలోని అన్ని న్యాయస్థానాల్లో సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు తెలిపారు. పెండింగ్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాద నష్టపరిహారాలు, రాజీపడదగిన క్రిమినల్ కేసులు పరిష్కారానికి అవకాశం ఉంటుందని చెప్పారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
Similar News
News December 14, 2025
అనకాపల్లి జిల్లా ప్రభుత్వ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుందర్రావు

జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కె.సుందర్రావు (మాకవరపాలెం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం అనకాపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఉపాధ్యక్షుడిగా ఆర్.గంగరాజు, కార్యదర్శిగా కె.ప్రేమ్ కుమార్, మహిళా కార్యదర్శిగా పీఆర్.కళ్యాణి ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిగా బీ.ఉమారాణి, కోశాధికారిగా శ్రీనివాసరావు, జిల్లా కౌన్సిలర్‌గా స్వామి ఎన్నికయ్యారు.
News December 14, 2025
ఇతిహాసాలు క్విజ్ – 96 సమాధానం

ఈరోజు ప్రశ్న: సూర్యుడి వేడిని తాళలేక తన లాంటి రూపమున్న స్త్రీని సృష్టించి, సూర్యుని వద్ద ఉంచి, అశ్వ రూపంలో అడవులకు వెళ్లిపోయింది ఎవరు?
సమాధానం: సూర్య భగవానుడి భార్య అయిన సంజ్ఞా దేవి తనలాగే ఉండే ఛాయాదేవిని సృష్టించి అడవులకు వెళ్లిపోయింది. సూర్యుని ద్వారా సంజ్ఞా దేవికి యముడు, యమున జన్మించారు. ఛాయాదేవికి శని, సావర్ణి, తపతి జన్మించారు. <<-se>>#Ithihasaluquiz<<>>
News December 14, 2025
ఉసిరితో మహిళలకు ఎన్నో లాభాలు

ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసిందే. ముఖ్యంగా మహిళలకు ఇది చాలా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. హార్మోన్లను సమతుల్యం చేయడంలో, PCOD, డయాబెటీస్‌ను తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. అలాగే జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతుంది. దీన్ని పచ్చిగా, ఎండబెట్టి పొడిలా, పచ్చడి, జ్యూస్ ఇలా నచ్చిన విధంగా తీసుకోవచ్చంటున్నారు.


