News June 17, 2024

ఉమ్మడి ADBలో పెండింగ్‌లో ధరణి దరఖాస్తులు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 17 వేలకు పైగా ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో తమ సమస్యలు పరిష్కారం కాకా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తుల్లో ఎక్కువగా భూ విస్తీర్ణం, సర్వే నెంబర్లలో తప్పులు, పేరు మార్పిడి, పట్టాల్లో తప్పులు దొర్లడం వంటి అంశాలకు సంధించిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా పెండింగ్ దరఖాస్తులు మంచిర్యాల జిల్లాలో ఉండగా అత్యల్పంగా అదిలాబాద్‌లో ఉన్నాయి.

Similar News

News September 30, 2024

విద్యార్థులు కష్టపడి పోటీపరీక్షల్లో రాణించాలి: గోడం నగేశ్

image

హైదరాబాద్‌లోని కొమరం భీం స్టడీ సర్కిల్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదవాలన్నారు. కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి, డా.సిడాం మధుకర్, మేస్రం నాగోరావు, తదితరులు పాల్గొన్నారు.

News September 29, 2024

ఆదిలాబాద్: DEECET విద్యార్థులకు GOOD NEWS

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో TG DEECET-2024లో ర్యాంక్ సాధించి ఆగస్టు నెలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరుకాని అభ్యర్థులకు మరొకసారి అవకాశం కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. కళాశాలలో అక్టోబర్ 1న ఉ.10 నుంచి సా.5 గంటల వరకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News September 29, 2024

ASF: రేపు జోనల్ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలు

image

ఆసిఫాబాద్‌లోని గిరిజన ఆదర్శ బాలికల క్రీడా పాఠశాలలో సోమవారం SGFజోనల్ స్థాయి అండర్-17 బాలబాలికల హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు DEOయాదయ్య, SGF జిల్లా సెక్రటరీ సాంబశివరావు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ఎంట్రీ ఫామ్‌లతో ఉదయం 9గంటలకు హాజరుకావాలన్నారు. వివరాలకు TW క్రీడల అధికారి మీనారెడ్డి, కోచ్ అరవింద్‌ను సంప్రదించాలని సూచించారు.