News March 30, 2024

ఉమ్మడి KNR జిల్లాలో భానుడి భగభగ

image

ఉదయం తొమ్మిది దాటితే భానుడు భగ్గుమంటున్నాడు. మధ్యాహ్నం వేళ తీవ్రరూపం దాల్చుతున్నాడు. రోజు రోజుకూ ప్రతాపం చూపిస్తున్నాడు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం అత్యధికంగా జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రత 42.5℃గా నమోదైంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటికి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు.

Similar News

News February 18, 2026

వీణవంక జాతర ఘటనపై డీజీపీకి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు

image

వీణవంకలో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పట్ల పోలీసుల ప్రవర్తనపై తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీ నారాయణ, కరీంనగర్ సీపీ గౌస్ ఆలంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై డీజీపీ స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు.

News February 18, 2026

KNR: తప్పనిసరిగా ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ చేసుకోవాలి: కలెక్టర్

image

కేంద్ర పథకాల లబ్ధి పొందేందుకు కరీంనగర్ జిల్లాలోని రైతులందరూ విధిగా ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ చేయించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. జిల్లాలో 2,09,450 మంది రైతులకు గాను, ఇప్పటివరకు 1,21,814 మంది నమోదు చేసుకున్నారని తెలిపారు. మిగిలిన 87,636 మంది కోసం ఈ నెల 19 నుంచి 28 వరకు ఏఈఓలు, మీ-సేవా కేంద్రాల ద్వారా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

News February 18, 2026

KNR: ‘మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత’

image

మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం అధికారులు, యువత, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘నార్కో కోఆర్డినేషన్’ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మత్తుమందులు విక్రయించే మెడికల్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ.. ఈ ఏడాది ఇప్పటివరకు 37 కేసులు నమోదు చేసి, 87 మందిని అరెస్ట్ చేశామన్నారు.