News September 20, 2024
ఉమ్మడి KNR జిల్లాలో సర్వేయర్ల కొరత!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సర్వేయర్ల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భూముల సర్వేకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పట్టించుకునేవారే కరువయ్యారు. సర్వేయర్ల నియామకం లేకపోవడంతో సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఎదురు చూస్తున్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలోని 4 జిల్లాల్లో 14,287 సర్వే దరఖాస్తులు దరఖాస్తులు పెండింగ్ ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
Similar News
News October 5, 2024
కోరుట్ల ఎస్సై- 2 శ్వేతను సస్పెండ్ చేసిన ఐజీ
జగిత్యాల జిల్లాలో కోరుట్ల పోలీస్‌స్టేషన్లో ఎస్సై-2 గా పనిచేసిన శ్వేతను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ ఉత్తర్వులు జారీచేశారు. జగిత్యాల పట్టణానికి చెందిన శివకుమార్ అనే వ్యక్తిపై గత నెల29న ఎస్సై శ్వేత చేయిచేసుకున్నారని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై పోలీస్‌శాఖ అధికారులు విచారణ చేపట్టారు. నివేదిక ఆధారంగా ఎస్సై-2 శ్వేతను సస్పెండ్ చేసినట్లు ఐజీ ప్రకటన జారీ చేశారు.
News October 5, 2024
కాటారం:అరుదైన అటవీ జంతువును తరలిస్తున్న ముఠా పట్టివేత?
అటవీ జంతువుల్లో అరుదుగా లభించే ‘అలుగు’ను తరలిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నట్లు తెలిసింది. పక్కా సమాచారం మేరకు అలుగును తరలిస్తున్న ముఠాను కాటారం మండలం మేడిపల్లి వద్ద అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయసమాచారం. ఈముఠాలో కాటారం సబ్ డివిజన్‌కు చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు, మరో ఇద్దరూ ఉన్నట్లు తెలిసింది. కాగా సదరు అలుగు విలువ రూ. 70లక్షల నుంచి రూ.కోటి పైనే ఉంటుందని సమాచారం.
News October 4, 2024
లక్కీ డ్రా నిర్వాహకులపై కేసు నమోదు: చందుర్తి CI
బహమతుల ఆశ చూపెడుతూ లక్కీ డ్రాలు నిర్వహిస్తున్న నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా దుర్గమ్మ విగ్రహాల వద్ద లయన్స్ యూత్ వారు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారన్నారు. ప్రజల వద్ద నుంచి ఒక్కొక్క లక్కీ డ్రా టికెట్ రూ.99 వసూలు చేస్తూ డ్రాలో పాల్గొనాలని ప్రచారం చేస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.