News April 2, 2024
ఉమ్మడి KNR జిల్లా వాసికి మిస్ టీన్ గెలాక్సీ టైటిల్

బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన ప్రమోద్‌రావు, సరిత దంపతుల కుమార్తె సుహానీరావు మిస్ టీన్ గెలాక్సీ పేజెంట్ యూకే టైటిల్ కైవసం చేసుకుంది. యూకేలోని వారింగ్‌టన్ పార్ హాల్‌లో యునైటెడ్ కింగ్‌డమ్ నలుమూలల నుంచి 25 మంది యువతులతో కలిసి పోటీపడి అన్ని విభాగాల్లో ప్రతిభ కనబర్చి దక్షిణాసియా మొదటి విజేతగా నిలిచింది. వచ్చే ఆగస్టులో యూఎస్‌ఏలో జరిగే పోటీల్లో యూకే తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.
Similar News
News February 13, 2026
జమ్మికుంట మున్సిపల్ కుర్చీకి తప్పని ‘ఎక్స్-అఫీషియో’ సెగ!

జమ్మికుంట మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడటంతో స్వతంత్రులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఎక్స్-అఫీషియో ఓట్ల వినియోగం, స్వతంత్రుల మద్దతుపైనే జమ్మికుంట మున్సిపల్ పీఠం భవితవ్యం ఆధారపడి ఉంది. రేపటిలోపు రాజకీయ సమీకరణాలు ఏ మలుపు తిరుగుతాయోనని పట్టణ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
News February 13, 2026
నలుగురి చేతిలో జమ్మికుంట భవితవ్యం..!

జమ్మికుంట మున్సిపాలిటీలో హంగు ఏర్పడడంతో BRS, కాంగ్రెస్ పార్టీలు స్వతంత్రులను తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా AIFB అభ్యర్థితో పాటు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులకు రెండు పార్టీల నుంచి భారీ ఆఫర్లు అందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకరిద్దరు అభ్యర్థులు మద్దతు ఇచ్చినా సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉండటంతో జమ్మికుంట రాజకీయం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
News February 12, 2026
KNR: ‘నగర’ ఫలితం: లెక్కింపునకు సర్వం సిద్ధం

కరీంనగర్ నగరపాలక సంస్థ 66 డివిజన్ల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. ఎస్ఆర్ఆర్ కళాశాలలో సిబ్బందికి నిర్వహించిన శిక్షణలో సీపీ గౌస్ ఆలం పాల్గొని దిశానిర్దేశం చేశారు. 300 మంది సిబ్బందితో శుక్రవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 66 టేబుళ్లు ఏర్పాటు చేయగా, తొలుత పోస్టల్ బ్యాలెట్లు, అనంతరం సాధారణ ఓట్లను లెక్కిస్తారు.


