News August 12, 2025
ఉస్మానియా యూనివర్సిటీ ఎంసీఏ పరీక్షల తేదీల ఖరారు

HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసీఏ రెండు, నాలుగో సెమిస్టర్ మెయిన్, అన్ని సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల తేదీల పూర్తి వివరాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు. SHARE IT
Similar News
News March 14, 2026
నిర్భయ నిధి కింద రాష్ట్రంలోని ములుగు జిల్లా ఎంపిక

నిర్భయ నిధి కింద “మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు” పథకానికి ములుగు జిల్లా ఎంపికైంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవిని కలిసి మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పాల్నా పథకం కింద పనిచేస్తున్న క్రెచ్ వర్కర్లు, హెల్పర్ల వేతనాలను పెంచాలని కేంద్రాన్ని కోరారు. ప్రాజెక్ట్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీతక్క పేర్కొన్నారు.
News March 14, 2026
MBNR: ఎటువంటి గ్యాస్ సిలిండర్ల కొరత లేదు

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి గ్యాస్ సిలిండర్ల కొడతా లేదని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజల ఆందోళన నేపథ్యంలో కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. సిలిండర్ల విషయంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందకూడదన్నారు. సంక్షేమ హాస్టల్లో హాస్పిటళ్లు విద్యాసంస్థలు అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ సరఫరా విషయంలో ఇబ్బందులు తలెత్తకూడదని వెల్లడించారు.
News March 14, 2026
మరి కాసేపట్లో గుత్తికొట ఉత్సవాలు ప్రారంభం

గుత్తి ఫుట్‌బాల్ క్రీడా మైదానంలో నేటి నుంచి ప్రారంభం కానున్న గుత్తి కోట ఉత్సవాలు మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. ఫుట్‌బాల్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన స్టేజీ వద్దకు ప్రజలు ఒక్కొక్కరుగా వస్తున్నారు. స్టేజ్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కోట ఉత్సవాలు 2 రోజుల పాటు జరగనున్నాయి.


