News September 10, 2025

ఊరగుట్టను పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేయాలి: కలెక్టర్

image

ఊరగుట్ట నేచర్ పార్కును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం ఇల్లందు మండలం సుభాష్‌నగర్‌లో ఉన్న ఊరగుట్ట నేచర్ పార్కును ఆయన సందర్శించారు.
పర్యాటకులను ఆకర్షించేందుకు, నేచర్ పార్కును అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. ఊరగుట్ట సహజసిద్ధమైన అందాన్ని కలిగి ఉందని, ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకుల కోసం సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

Similar News

News December 9, 2025

నిర్మల్: ఈరోజు సాయంత్రం నుంచి మైకులు బంద్

image

నిర్మల్ జిల్లా ఖానాపూర్, పెంబి, కడెం, దస్తూరాబాద్, మామడ, లక్ష్మణచందా మండలాల్లోని 136 పంచాయతీలకు మొదటి విడతలో భాగంగా 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం గడువు నేటి సాయంత్రంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు, వారి బంధువులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఎక్కడా సమయం వృథా చేయకుండా ప్రతి ఓటరును కలుస్తూ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

News December 9, 2025

మంచిర్యాల: ఈరోజు సాయంత్రం నుంచి మైకులు బంద్

image

మంచిర్యాల జిల్లా దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్షెట్టిపేట మండలాల్లోని 90 పంచాయతీలకు మొదటి విడతలో భాగంగా 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం గడువు నేటి సాయంత్రంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు, వారి బంధువులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఎక్కడా సమయం వృథా చేయకుండా ప్రతి ఓటరును కలుస్తూ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

News December 9, 2025

కడప జిల్లా SP కీలక సూచన.!

image

భూ వివాదాలు, ఆర్థిక నేరాల విచారణలో న్యాయపరమైన నిబంధనలు పాటించాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారులకు సూచించారు. సోమవారం ఎస్పీ ప్రొద్దుటూరు పోలీస్ అధికారులకు కేసుల విచారణలో నిర్దేశం చేశారు. క్రిమినల్ కేసులు నమోదైన ఎడల వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. సంబంధిత అధికారులు, లీగల్ ప్రొసీజర్ మేరకు కేసు విచారణ త్వరితగతిన నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు.