News September 12, 2025

ఊర్కోండలో అత్యధిక వర్షపాతం నమోదు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో గడిచిన 24 గంటల వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఊర్కొండ మండల కేంద్రంలో అత్యధికంగా 62.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వెల్టూరు 60.0 మి.మీ, కల్వకుర్తి 46.5 మి.మీ, సిర్సనగండ్ల 37.5 మి.మీ, బొల్లంపల్లి 36.0, వెల్దండ 35.5, పదర 21.3, వటవర్లపల్లి 20.0 మి.మీ, లింగాల 18.0 మి.మీ, తిమ్మాజిపేట 14.0, తెలకపల్లి 15.8, తోటపల్లి 11.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.

Similar News

News December 13, 2025

మరో అరగంటలో ఉప్పల్ స్టేడియానికి మెస్సీ!

image

హైదరాబాద్‌‌లో మెస్సీ మేనియా నడుస్తోంది. మరో అరగంటలో ఆయన ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియానికి రానున్నట్లు సమాచారం. దీంతో వందలాది మంది ఫుడ్ బాల్ క్రీడాకారులు, అభిమానులు పాస్‌లు తీసుకొని స్టేడియానికి పోటెత్తారు. మరోవైపు పోలీసులు భారీ బందోబస్తు నడుమ స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. కొందరేమో మెస్సీకి అభివాదం చెప్పేందుకు స్టేడియం బయట బారులు తీరారు.

News December 13, 2025

పోలింగ్‌కు పగడ్బందిగా ఏర్పాట్లు: ఆదిలాబాద్ కలెక్టర్

image

ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సాత్నాల ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. తహశీల్దార్ జాదవ్ రామారావు, ఎంపీడీవో వెంకట రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.