News October 8, 2025

ఎంతో మందికి ఫ్రీగా చదువు చెప్పాం: మంచు విష్ణు

image

MBU తాజా ఘటనపై మంచు విష్ణు స్పందించారు. ‘ఏపీ ఉన్నత విద్యా కమిషన్(APHERMC) చేసిన సిఫార్సులపై కోర్టు స్టే విధించింది. శ్రీవిద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌తో ఎంతోమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాం. అమెరికాలోని యూనివర్సిటీతో జాయింట్ డిగ్రీ ప్రవేశపెట్టిన దేశంలోనే ఏకైక యూనివర్సిటీ మాదే. APHERMC నివేదికలోని కొన్ని అంశాలనే ప్రచారం చేస్తున్నారు. వీటిని తల్లిదండ్రులు నమ్మవద్దు’ అని ఆయన ఓ ప్రకటనలో కోరారు.

Similar News

News January 17, 2026

₹16 లక్షల కోట్లకు చేరనున్న రిటైల్ వస్త్ర వ్యాపారం

image

దేశంలో రిటైల్ వస్త్ర వ్యాపారం శరవేగంగా విస్తరిస్తోంది. 2029-30 నాటికి ₹16 లక్షల కోట్లకు విస్తరించనుందని ‘కేర్ ఎడ్జ్’ అంచనా వేసింది. ‘ప్రస్తుతం 9.30 లక్షల కోట్లతో 41% శాతం వాటా రిటైల్ వ్యాపారానిదే. బ్రాండెడ్ దుస్తులకు ప్రాధాన్యం పెరగడం, అంతర్జాతీయ బ్రాండ్ల ప్రవేశంతో మరో 13% పెరగనుంది. టైర్2, 3 పట్టణాల్లో ఈ కామర్స్ సహా, జుడియో, మాక్స్ ఫ్యాషన్, రిలయన్స్ యోస్టా వంటివి వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.

News January 17, 2026

ములుగు ఓఎస్డీ శివం ఉపాధ్యాయ బదిలీ

image

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐపీఎస్ బదిలీల్లో భాగంగా ములుగు జిల్లా ఓఎస్డీగా ఉన్న శివం ఉపాధ్యాయను డీసీపీ ట్రాఫిక్, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కి బదిలీ చేశారు. 2021 బ్యాచ్‌కు చెందిన శివం ఉపాధ్యాయ ఇంతకుముందు ఏటూర్ నాగారం ఎఎస్పీగా పనిచేసి, ఇటీవలే ములుగు ఓఎస్డీగా బదిలీపై వచ్చారు. మేడారం జాతర సమయంలో చురుగ్గా పనుల్లో పాల్గొంటున్న ఈ సమయంలో ఓఎస్డీని బదిలీ చేయడం పోలీసు వర్గాల్లో సంచలనం స్భష్టించింది.

News January 17, 2026

అనంతపురం: భార్యను బండరాయితో మోదిన భర్త

image

అగ్నిసాక్షిగా మూడు ముళ్ళు వేసిన భర్త కట్టుకున్న భార్యకు కాలయముడయ్యాడు. బండరాయితో భార్య తలపై మోది హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాయదుర్గం మండలంలోని టి.వీరాపురంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. రక్తపు మడుగులో ఉన్న భార్య శివగంగమ్మను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి భర్త సుంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.