News April 26, 2024
ఎంపీ ఎన్నికలు.. ఆదిలాబాద్‌కు 23, పెద్దపల్లికి 63 మంది నామినేషన్లు

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఆదిలాబాద్ లోక్‌సభకు 23 మంది అభ్యర్థులు 42 సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. BJP, కాంగ్రెస్, BRS అభ్యర్థులు గోడం నగేశ్, ఆత్రం సుగుణ, ఆత్రంసక్కుతో పాటు స్వతంత్రులు నామినేషన్ వేశారు. పెద్దపల్లి స్థానానికి 63 మంది 109 నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 26న నామపత్రాల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు చివరి తేదీ.
Similar News
News April 14, 2026
16 నుండి మండలస్థాయి సదస్సులు : ADB కలెక్టర్

జిల్లాలో ఏప్రిల్ 16వ తేదీన నిర్వహించనున్న ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి సదస్సులను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. నిన్నగూగుల్ మీట్ లో దిశానిర్దేశం చేశారు. సదస్సుల నిర్వహణలో భాగంగా పోషణ్ మాస్ స్టాల్స్‌తో పాటు గర్భిణీలకు సీమంతాల కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బాల్య వివాహ రహిత పంచాయతీలుగా తీర్మానం చేసిన గ్రామాలకు గుర్తింపునివ్వాలన్నారు.
News April 14, 2026
ADB: పెళ్లి సంబరాలు కావద్దు విషాదం..!

ఆదిలాబాద్ జిల్లాలో పెళ్లిల జోరు కొనసాగుతోంది. దీంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సామూహికంగా వెళ్తుంటారు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో పరిమితికి మించి లారీలు, ట్రాక్టర్లు వంటి వాహనాల్లో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఇటీవల సిరికొండ మండలానికి చెందిన వాహనం నిర్మల్ సమీపంలో ప్రమాదానికి గురై ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే.
News April 14, 2026
ఆదిలాబాద్: హెల్మెట్ తీర్మానం.. ఆదర్శంగా నిలిచిన జామిడి

99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన డీజీపీ శివధర్ రెడ్డికి జామిడి సర్పంచ్ ఈరగొల్ల అశోక్ వినూత్నమైన తీర్మానాన్ని అందజేశారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరిస్తామని, ఇతర గ్రామాల వారు కూడా హెల్మెట్ ఉంటేనే తమ గ్రామంలోకి రావాలన్న నిర్ణయాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో వివరించారు. ఈ బాధ్యతాయుతమైన నిర్ణయాన్ని డీజీపీ అభినందించారు.


