News April 30, 2024
ఎంపీ ఎన్నికలు.. బర్రెలక్కకు ‘విజిల్’ గుర్తు కేటాయింపు

నాగర్‌కర్నూల్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క(శిరీష)కు ఎన్నికల సంఘం ‘విజిల్’ కేటాయించింది. తన లైఫ్ టర్న్ అయిన, లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవాల్సిన సింబల్ ‘విజిల్’ వచ్చిందని శిరీష హర్షం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల తరపున నామినేషన్ వేసిన నేపథ్యంలో ఎంతోమంది బెదిరించినా ఉపసంహరించుకోలేదన్నారు. నాగర్ కర్నూల్ ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ తనపై ఉంటాయని.. వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ఆమె కోరారు.
Similar News
News December 14, 2025
MBNR: ఆరు మండలాల్లో 79.30 శాతం పోలింగ్

మహబూబ్‌నగర్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. హన్వాడ, మిడ్జిల్, కోయిలకొండ, చిన్న చింతకుంట, కౌకుంట్ల, దేవరకద్ర మండలాల్లో ఒంటిగంట వరకు 79.30% పోలింగ్ నమోదైంది. దేవరకద్ర మండలంలో అత్యధికంగా 88% పోలింగ్ జరగ్గా, మిడ్జిల్‌లో 73% నమోదైంది. మొత్తం 1,46,557 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.
News December 14, 2025
MBNR: 11 గంటల వరకు 55 శాతం పోలింగ్

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 06 మండలాలలో రెండవ విడత సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఉదయం 07 గంటల నుంచి 11 గంటల వరకు దాదాపు 55 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. చిన్నచింతకుంట, కౌకుంట్ల, హన్వాడ, మిడ్జిల్, కోయిలకొండ, దేవరకద్ర మండలాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
News December 14, 2025
MBNR: రెండో విడత ఎన్నికలు.. గెట్ రెడీ!

MBNR జిల్లాలోని హన్వాడ(35 GP), సీసీకుంట(18), దేవరకద్ర(18), కోయిలకొండ(44), కౌకుంట్ల(12), మిడ్జిల్(24) మండలాల్లోని 151 GPలకు నేడు రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. 151 సర్పంచ్ పదవులకు, 1,334 వార్డులకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. జీపీ ఎలక్షన్ ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.


