News April 13, 2025
ఎంపీ కడియం కావ్యకు వినతి పత్రం

తెలంగాణలోని 12 విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న 1270 మంది యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులందర్నీ రెగ్యులర్ చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని నేడు WGL MP కడియం కావ్యకి TG ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డా. శ్రీధర్ కుమార్ లోధ్, జేఏసీ నాయకులు డా. సాధు రాజేష్, డా. టి.నాగయ్య, డా.సంగీత్ కుమార్, డా.లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
Similar News
News January 13, 2026
నల్గొండ: పాఠశాల నిర్మాణ పనుల తనిఖీ

వచ్చే విద్యా సంవత్సరం నాటికి నల్గొండ ఎస్ఎల్ బీసీ వద్ద చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల అకడమిక్ బ్లాక్, తరగతి గదుల నిర్మాణ పనులను పూర్తి చేసి అప్పగించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఎస్ఎల్‌బీసీ వద్ద ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను తనిఖీ చేశారు.
News January 13, 2026
డిఫెన్స్ పటిష్ఠతపై కేంద్రం దృష్టి

ప్రపంచంలో రాజకీయ అనిశ్చితి, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశ రక్షణ బడ్జెట్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. US సహా పలు దేశాలు ఇప్పటికే డిఫెన్స్‌కు అధిక నిధులు కేటాయిస్తున్నాయి. ఇటు చైనా తన సైనిక శక్తిని విస్తరిస్తోంది. ఈ తరుణంలో మన ’రక్షణ’పై కేంద్రం దృష్టి సారించింది. గత బడ్జెట్లో ₹6.8L CR డిఫెన్స్‌కు కేటాయించింది. ఈసారి అది మరింత పెరగొచ్చని జియోజిత్ ఇన్వెస్టుమెంట్స్ చీఫ్ విజయకుమార్ పేర్కొన్నారు.
News January 13, 2026
శ్రీకాకుళం: మాజీ మంత్రి సూర్యనారాయణ అంత్యక్రియలు పూర్తి

మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ అంత్యక్రియలు శ్రీకాకుళంలో మంగళవారం పూర్తి చేశారు. అధిక సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు, అభిమానులు మధ్య ఆయన అంత్యక్రియలు జరిగాయి. ప్రజా సేవ లక్ష్యంగా పని చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని ఎమ్మెల్యే రమణమూర్తి పేర్కొన్నారు. ఎన్నో ఎదురు దెబ్బలకు ఎదుర్కొన్న ఆయన టీడీపీలో ఊపిరి పోయేవరకు కొనసాగారని వివరించారు. ఆయన మృతితో పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.


