News March 27, 2024

ఎచ్చెర్ల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వివరాలివే!

image

ఎచ్చెర్ల నియోజకవర్గంలో మిత్ర పక్షాల ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ నుంచి ఎన్. ఈశ్వరావును అధిష్ఠానం బుధవారం రాత్రి నిర్ణయించింది. వీరి స్వగ్రామం రణస్థలం మండలం బంటుపల్లి పంచాయితీ నడుకుదిటిపాలెం. అతని తండ్రి నడుకుదిటి అప్పలకొండ 1982 నుంచి టీడీపీలో ఉన్నారు. ఎన్. ఈశ్వరావు MBA, MCOM పూర్తి చేశారు. ఈయన విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షులుగా పని చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Similar News

News February 16, 2026

టెక్కలి: మూడేళ్ళ క్రితం తండ్రి మృతి… ఇప్పుడు కుమార్తె ఆత్మహత్య

image

టెక్కలి మండలం పాలసింగి గ్రామానికి చెందిన ఏ.అరుణ(19) అనే ఇంజినీరింగ్ విద్యార్థిని ఆదివారం <<19152656>>కాకినాడ JNTU హాస్టల్‌లో ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. కాగా మృతురాలి తండ్రి రాము మూడేళ్ల క్రితం తిరుపతిలో భవన నిర్మాణ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు. తాజాగా కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మృతురాలికి తల్లి సంధ్య(వ్యవసాయ కూలీ), సోదరుడు ఉన్నారు.

News February 15, 2026

జేఎన్టీయూ హాస్టల్‌లో శ్రీకాకుళం విద్యార్థిని సూసైడ్

image

కాకినాడ జేఎన్టీయూలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న ఏ.అరుణ(19) ఇవాళ సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నట్లు సర్పవరం పోలీసులు తెలిపారు. జేఎన్టీయులోని నాగవల్లి లేడీస్ హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. మృతురాలిది శ్రీకాకుళం జిల్లా పాలసింగి గ్రామం అని చెప్పారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని.. కేసుపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

News February 15, 2026

శ్రీకాకుళం: ఉద్యోగం పేరిట మహిళకు మోసం

image

ఉద్యోగాల పేరుతో తనతో పాటు మరికొందరు మోసపోయినట్లు శ్రీకాకుళంలోని బొందిలిపురానికి చెందిన ఎం. విజయలక్ష్మి శనివారం 2టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన గోపాల్ రెడ్డి, నాగేంద్ర రెడ్డి ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. 15 లక్షలు కాజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె వద్ద మరిన్ని వివరాలు సేకరించి టూ టౌన్ సీఐ ఈశ్వర్ రావు కేసు నమోదు చేశారు.