News July 8, 2024
ఎచ్చెర్ల: ప్రభుత్వ ITIలో 10న ఉద్యోగ మేళా

ఎచ్చెర్లలోని ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 10వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ITI ప్రవేశాల జిల్లా కన్వీనర్ సుధాకర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ITI ఏ గ్రేడ్‌లో ఉత్తీర్ణులైన వారు ఈ మేళాకు హాజరు కావచ్చని చెప్పారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు కలిగిన ఆసక్తి గల అభ్యర్థులు 10వ తేది ఉదయం 9 గంటలకు విద్యార్హత ధ్రువపత్రాలతో పాటు బయోడేటా, రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు.
Similar News
News December 8, 2025
బాల్యవివాహాలు నిర్మూలన మనందరి బాధ్యత: కలెక్టర్

బాల్య వివాహాల నిర్మూలన మనందరి బాధ్యతని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సంబంధిత వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. బాల్య వివాహాల రహిత భారత దేశంగా ముందుకు నడిపించేందుకు అందరి వంతు కృషి అవసరం అన్నారు. బాల్యవివాహాల వలన ఎన్నో అనర్థాలు కలుగుతున్నాయి అని ఆయన తెలియజేశారు. జిల్లాస్థాయి అధికారులు ఉన్నారు.
News December 8, 2025
శ్రీకాకుళం: ‘ధాన్యాన్ని అధనంగా తీసుకుంటున్నారు’

ధాన్యం కొనుగోళ్లలో కొనుగోలు కేంద్రాల వద్ద 3 నుంచి 5 కేజీలు అధనంగా రైతుల నుంచి మిల్లర్లు తీసుకుంటున్నారని ఏపీ రైతు సంఘం పీజీఆర్ఎస్‌లో సోమవారం ఫిర్యాదు చేసింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతి పత్రం అందజేశారు. నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని ప్రసాదరావు, చందర్రావు అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అధికారులు అమలు చేయాలని కోరారు.
News December 8, 2025
9 వరకు టెన్త్ ఫీజు చెల్లింపు గడువు పెంపు SKLM DEO

ఎటువంటి అపరాదరుసుం లేకుండా డిసెంబర్ 9 వరకు టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించవచ్చని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు సోమవారం తెలిపారు. రూ.50 ఫైన్‌తో 10 నుంచి 12 వరకు, రూ.200 ఫైన్‌తో 13 నుంచి 15 వరకు, రూ.500 ఫైన్‌తో 16 నుంచి 18వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. సంబంధిత పాఠశాలల హెచ్ఎంలకు సమాచారం తెలియజేశామన్నారు.


