News November 6, 2025
ఎనుమాముల మార్కెట్‌ను సందర్శించిన కలెక్టర్

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను వరంగల్ కలెక్టర్ డా.సత్యశారద అధికారులతో కలిసి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మార్కెట్‌లోని రైతులు, వ్యాపారస్తులతో ముచ్చటించి, మార్కెట్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతుల సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై మార్కెట్ అధికారులతో కలెక్టర్ చర్చించారు.
Similar News
News January 12, 2026
వరంగల్: స్వాతంత్ర్య సమరయోధురాలు కన్నుమూత

వరంగల్ పరిధి గిర్మాజిపేటకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత వన్నాల పెద్ద వీరన్న సతీమణి, స్వాతంత్ర్య సమరయోధురాలు వన్నాల లక్ష్మి ముదిరాజ్ (100) అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె దేశం కోసం చేసిన పోరాటం, దేశభక్తి స్ఫూర్తి, సేవా విలువలను కుటుంబ సభ్యులు, స్థానికులు గుర్తు చేస్తున్నారు. అభిమానులు, పలువురు నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
News January 12, 2026
ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేసిన జేసీ

గ్రామాల్లో ఇంటింట చెత్త సేకరణ కోసం అన్నమయ్య జేసీ ఎలక్ట్రిక్ ఆటోలను సోమవారం పంపిణీ చేశారు. స్వచ్ఛ, స్వర్ణ ఆంధ్ర కార్యక్ర మానికి ఆటోలను స్వచ్ఛఆంధ్ర కార్పొరేషన్ మంజూరు చేసిందని జేసీ అన్నారు. 8 ఎలక్ట్రికల్ ఆటోలను జిల్లాకు ప్రతిపాదన చేయగా వాటిని చిన్నమండెం మండల పడమటికోన పంచాయతీ, ఓబులవారిపల్లి మండలంలో ఓబులవారిపల్లికి, వీరబల్లి మండలంలోని ఓడివీడు పంచాయతీలకు పంపిణీ చేశామన్నారు.
News January 12, 2026
తిరుపతి జిల్లాకు అవి రెండు ముప్పే.!

తిరుపతి జిల్లాలోని దామలచెరువు, ముంగిలిపుట్టు, బాలిజేపల్లి గ్రామాల్లో భూగర్భ జలాల్లో యురేనియం ఆనవాళ్లు ఉన్నట్లు CGWB నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో తీర ప్రాంతాల్లో భూగర్భ జలాలను అధికంగా తోడటం వల్ల సముద్రపు ఉప్పు నీరు భూమిలోకి చొచ్చుకొస్తోందని హెచ్చరించింది. ఈ ‘సీవాటర్ ఇంట్రూజన్’ సమస్య వల్ల తాగునీటి నాణ్యత మరింత దిగజారే ప్రమాదం ఉంది. దీంతో ముందుకెళ్తే నుయ్యి, వెనకెళ్తే గొయ్యి అన్నట్లయింది పరిస్థితి.


