News November 19, 2025
ఎనుమాముల మార్కెట్‌లో పల్లికాయ క్వింటా రూ.6,210

చాలా రోజుల తర్వాత వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు పల్లికాయ (వేరుశనగ) తరలివచ్చింది. ఈ క్రమంలో పచ్చి పల్లికాయ క్వింటాకు రూ. 6,210 ధర రాగా, సూక పల్లికాయ రూ.4,500 ధర పలికింది. మరోవైపు, మార్కెట్‌కి వచ్చిన మొక్కజొన్న (మక్కలు) ధర భారీగా తగ్గింది. సోమవారం రూ. 2,080 ఉన్న ధర, ఈ రోజు రూ. 2,030కి పడిపోయింది.
Similar News
News January 16, 2026
రికార్డింగ్ డాన్సులను బ్యాన్ చేయండి: సునీతా కృష్ణన్

AP: సంక్రాంతి సందర్భంగా జరుగుతున్న రికార్డింగ్ డాన్సులపై సంఘసేవకురాలు సునీతా కృష్ణన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. యువతులతో అసభ్యకరంగా టాప్‌లెస్ డాన్స్‌లు చేయించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అనాగరిక పద్ధతిని సమాజం సాధారణ విషయంగా చూడటం అత్యంత ప్రమాదకరమని, మహిళల గౌరవాన్ని కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని X వేదికగా సీఎం చంద్రబాబును కోరారు.
News January 16, 2026
MBNR: CM పర్యటన.. ట్రాఫిక్ మళ్లింపు1/2

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన సందర్భంగా.. ప్రజల భద్రతతో పాటు ట్రాఫిక్ సజావుగా కొనసాగేందుకు శనివారం మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు నిబంధనలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీఎం సమావేశానికి సంబంధించిన వాహనాలు తప్ప, సాధారణ వాహనాలకు అనుమతి ఉండదు. 1. కర్నూల్ నుంచి మహబూబ్‌నగర్ వచ్చే వాహనాలు →NH 44 నందు తాటికొండ మీదుగా మహబూబ్‌నగర్ టౌన్‌లోకి ప్రవేశించవచ్చు.
News January 16, 2026
పార్లమెంట్‌లో ‘జై పాల్’మూరు

MBNR జిల్లా మాడ్గులలో జన్మించిన జైపాల్ రెడ్డి, ఉస్మానియాలో చదివే రోజుల్లోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. 18 ఏళ్ల వయసులోనే పోలియో బారిన పడినా తన మేధోశక్తితో దాన్ని అధిగమించారు. 1969లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మరో 3సార్లు MLAగా, 5 సార్లు లోక్‌సభ ఎంపీగా, 2సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. కేంద్రంలో అనేక మంత్రి పదవులకు వన్నె తెచ్చారు. # నేడు ఆయన జయంతి.


