News September 12, 2025

ఎన్‌కౌంటర్‌లో వరంగల్ మావోయిస్టు మనోజ్ మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వరంగల్ జిల్లా ఘన్‌పూర్‌కు చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోదం బాలకృష్ణ మృతి చెందాడు. మనోజ్‌పై రూ.కోటి రివార్డు ఉందని అక్కడి పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో బాలకృష్ణతో సహా మొత్తం పది మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు.

Similar News

News December 17, 2025

రంపచోడవరం: ‘రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలి’

image

ఆసుపత్రికి వచ్చిన రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని రంపచోడవరం ఐటీడీఏ పీఓ స్మరన్ రాజ్ అన్నారు. బుధవారం మారేడుమిల్లి పీహెచ్సిని ,దేవరాపల్లి ఆశ్రమ పాఠశాలను ఐటీడీఏ పీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఆశ్రమ పాఠశాలలో డిజిటల్ తరగతి గదిలో క్లాస్‌లు ఏ విదంగా జరుగుతున్నాయో చూశారు.
దేవరపల్లిలో రబ్బర్ ప్లాంటేషన్‌ను పరిశీలించారు.

News December 17, 2025

నిజామాబాద్ జిల్లా మూడో విడత తొలి ఫలితం

image

కమ్మర్‌పల్లి మండల పరిధిలోని 13 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేశారు. రాజ రాజేశ్వరి నగర్ సర్పంచిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి తైద సుశీల-సాయన్న విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 33 ఓట్లతో గెలుపొందారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు.

News December 17, 2025

ఆసిఫాబాద్: మొదటి గెలుపు మహిళదే

image

ఆసిఫాబాద్ మండల పరిధిలోని 27 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గోవింద్ పూర్ గ్రామ సర్పంచ్‌గా లక్ష్మీ కురట్కార్ 7 ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థిపై గెలుపొందారు. 5 వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా 3 వార్డులకు ఎన్నికలు జరిగాయి. దీంతో గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు మొదలయ్యాయి.