News April 14, 2025
ఎన్టీఆర్: చెట్ల క్రింద నిలబడవద్దు: APSDMA ఎండీ

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తాజాగా హెచ్చరించింది. ఈ మేరకు APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ ప్రజానీకాన్ని హెచ్చరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ప్రజలు నిలబడరాదని ఆయన సూచించారు.
Similar News
News January 13, 2026
అన్నమయ్య జిల్లాలో DSC ఉద్యోగాలు ఇలా..!

రాబోయే DSC నోటిఫికేషన్‌లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 70-30%తో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్టు DEO రాజేంద్రప్రసాద్ తెలిపారు. 560కి పైగా పోస్టులు ఉండగా.. 30% నోటిఫికేషన్ 70% పోస్టులను పదోన్నతులతో నింపనున్నారు. ఖాళీల జాబితాను అధికారులు సిద్ధంచేస్తున్నట్టు చెప్పారు. ఈ నెలాఖరుకల్లా పూర్తి పోస్టుల జాబితా వస్తుందన్నారు. నూతన DSC ప్రకటన ఫిబ్రవరిలో వెలువడనుండగా జూన్ చివరికి నియామక ప్రక్రియ పూర్తవనుంది.
News January 13, 2026
గద్వాల: నేటి నుంచి ‘Arrive Alive’ ప్రచారం

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 13 నుంచి 24 వరకు ‘Arrive Alive – A Campaign for Safer Roads in Telangana’ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. డీజీపీ ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్, సీట్‌బెల్ట్ ధారణపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.
News January 13, 2026
HYD: మట్టిలో పుట్టిన మాణిక్యం.. మర్రి చెన్నారెడ్డి

స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ ద్రష్ట మర్రి చెన్నారెడ్డి 1919 JAN 13న వికారాబాద్ (D) మార్పల్లి (M) సిరిపురంలో జన్మించారు. MBBS పూర్తి చేసి వైద్యవృత్తిని ప్రజాసేవగా మలిచారు. 1969 TG ఉద్యమంలో కీలక భూమిక పోషిస్తూ తెలంగాణ ప్రజా సమితికి నాయకత్వం వహించారు. ఉద్యమ ఉత్థాన, పతనాల మధ్య పార్టీని రాజకీయ శక్తిగా నిలిపారు. 1978లో మేడ్చల్ నుంచి MLAగా గెలిచి ఉమ్మడి AP CMగా బాధ్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించారు.


