News March 31, 2024
ఎన్టీఆర్ జిల్లాలో రూ.16.10లక్షల నగదు, బంగారం పట్టివేత

ఎన్నికలో నేపథ్యంలో జిల్లా కమిషనరేట్ పరిధిలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. CP కాంతిరాణా టాటా మాట్లాడుతూ.. పశ్చిమ DCP పరిధిలో ప్రకాశం బ్యారేజ్, గుంటుపల్లి, పాముల కాలువ, నున్న పవర్ గ్రిడ్ ప్రాంతాల్లోని చెక్‌పోస్టుల్లో రూ.5.55లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 1టౌన్ స్టేషన్ పరిధిలో రూ.10.55లక్షల నగదు, 79.1గ్రాముల గోల్డ్ పట్టుకుని ఎన్నికల అధికారులకు అందిచామన్నారు.
Similar News
News February 16, 2026
కృష్ణా: రోడ్డు ప్రమాదాల నివారణపై కలెక్టర్ సమీక్ష

కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన మచిలీపట్నం కలెక్టరేట్‌లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలపై సమీక్షించారు. మచిలీపట్నం-విజయవాడ NHపై వేగ నియంత్రణల కోసం ఏర్పాటు చేసిన డ్రమ్ములు రాత్రి పూట కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. స్పందించిన కలెక్టర్ తక్షణమే డ్రమ్ములకు రేడియం స్టిక్కర్లు వేయాలని ఆదేశించారు.
News February 16, 2026
PGRSలో వచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి: DRO

PGRSలో వచ్చే ప్రతి అర్జీకి పరిష్కార మార్గం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం మచిలీపట్టణం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో ఆయన పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
News February 16, 2026
బిల్ గేట్స్‌కు కలంకారీ వస్త్రాలను బహుకరించిన కలెక్టర్

రాష్ట్ర పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్‌కు గన్నవరం విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. కలెక్టర్ డీకే బాలాజీ బిల్ గేట్స్‌కు పెడన కలంకారీ వస్త్రాలను బహుకరించి స్వాగతం పలికారు. సహజమైన రంగులతో ముద్రించిన కలంకారీ వస్త్రాల విశిష్టత, దాని వెనుక దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని కలెక్టర్ ఆయనకు వివరించారు.


