News February 6, 2025
ఎన్టీఆర్: పరీక్షల టైం టేబుల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో బీ ఫార్మసీ చదివే విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్(రెగ్యులర్) థియరీ పరీక్షలను ఈ నెల 18, 20, 22, 24వ తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామని ANU వర్గాలు తెలిపాయి. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరారు.
Similar News
News March 24, 2025
తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

సూర్యాపేట(D) బీబీగూడెం శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొర్రూరు మండలానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆత్మకూరు(ఎస్) మండలం కోటపహాడ్‌లో శుభకార్యానికి కంటాయపాలెంకు చెందిన గడ్డం రవీందర్ (34), ఆయన భార్య రేణుక (28), కుమార్తె రిషిత(8) వెళ్లారు. తిరిగి HYD వెళ్తుండగా బస్సు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
News March 24, 2025
ఘోర ప్రమాదం.. తమిళనాడులో కడప యువకులు మృతి

దైవదర్శనానికి వెళ్తున్న కడప యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కడపకు చెందిన నాగేంద్ర(31), శేషాచలం(29) ఆదివారం తమిళనాడు తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి దర్శనానికి బైకుపై వెళ్లారు. రాణీపేట సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన కంటైనర్ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కిందపడ్డారు. అదే సమయంలో వచ్చిన కారు వారిపై వెళ్లింది. దీంతో ఇద్దరి శరీరాలు చిధ్రమై స్పాట్‌లో మృతి చెందారు.
News March 24, 2025
MBNR: మాజీ మంత్రి VS MLA.. తగ్గేదేలే..!

మహబూబ్‌నగర్‌లో రాజకీయం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు మాజీ మంత్రి, BRS మాజీ MLA శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఫైర్ అవుతున్నారు. 14 నెలల్లో రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఆగం చేసిందంటున్నారు. మరోవైపు MLA యెన్నెం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు. అప్పులు చేసి ఆగం చేసింది BRS వాళ్లే అని కౌంటర్ ఇస్తున్నారు. మీ కామెంట్?