News March 28, 2024
ఎన్టీఆర్: ప్రయాణికులకు శుభవార్త
ప్రయాణికుల రద్దీ మేరకు సికింద్రాబాద్ (SC), దిబ్రుగఢ్ (DBRG) మధ్య విజయవాడ మీదుగా నడిచే స్పెషల్ ఫేర్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నెం.07046 SC- DBRG మధ్య నడిచే రైలును ఏప్రిల్ 1 నుంచి మే 13 వరకు ప్రతి సోమవారం, నం. 07047 DBRG- SC మధ్య నడిచే రైలును ఏప్రిల్ 4 నుంచి మే 16 వరకు ప్రతి గురువారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు విజయవాడతో పాటు విశాఖపట్నం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Similar News
News January 16, 2025
విజయవాడ: మెడికల్ విద్యార్థులకు గుడ్ న్యూస్
విజయవాడ ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో GNM సీట్లు పెంచుతూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న జీఎన్ఎం 30 సీట్లు ఉండగా వాటిని 60కి పెంచుతూ ఈ ఉత్తర్వులో పేర్కొంది. 30 నుంచి 60 మేరకు GNM సీట్లు పెంచుతూ వైద్యారోగ్య శాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
News January 16, 2025
17న కృష్ణా జిల్లాకు కేంద్రమంత్రి అమిత్ షా
కేంద్ర మంత్రి అమిత్‌షా ఈనెల 17,18 కృష్ణాజిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 17 రాత్రికి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లి వెళ్లి సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. 18వ తేదీ గన్నవరం మండలంలోని కొండపావులూరులో నూతనంగా నిర్మించిన NIDM, NDRF, 10వ బెటాలియన్ ప్రాంగణాలను ఆయన ప్రారంభించనున్నారు.
News January 16, 2025
రూ.1.25కోట్ల పందెం గెలిచిన గుడివాడ కోడి
గుడివాడ మండలానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి నిన్న ప.గో జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన కోడి పందెంలో రూ.1.25కోట్లను గెలుచుకున్నారు. దీంతో నిన్నటి వరకు ఒక ఎత్తు నిన్నటి నుంచి మరో ఎత్తు అన్న చందాన గుడివాడ ప్రభాకర్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. కాగా ఆయన ప్రతినిత్యం కోళ్లతో మమేకమవుతూ కోడిపందేల్లో ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా పేరొందారు.