News March 8, 2025

ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి కీలక ప్రకటన

image

విజయవాడ: ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌(NTRUHS)లో జూనియర్ అసిస్టెంట్ పోస్టు భర్తీకై ఈ ల 17న ఉదయం,మధ్యాహ్నం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరగనుంది. కాగా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 10 నుంచి హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని NTRUHS తెలిపింది. ఈ మేరకు https://psc.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచిస్తూ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. 

Similar News

News April 11, 2026

WTCలో మార్పులు.. ఇక నుంచి 12 జట్లు?

image

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పలు మార్పులు జరిగే అవకాశముంది. 2027 నుంచి మొదలయ్యే WTC సైకిల్‌లో జట్ల సంఖ్యను 9 నుంచి 12కి పెంచాలని ICC వర్కింగ్ గ్రూప్ ప్రతిపాదించింది. కొత్తగా ZIM, IRE, AFGను చేర్చాలంది. కాగా ప్రస్తుతం కనీసం 2 మ్యాచుల సిరీస్‌ల ఫలితాలు WTC pts టేబుల్‌కి యాడ్ అవుతున్నాయి. ఇక నుంచి సింగిల్ టెస్ట్ సిరీస్‌ల ఫలితాలనూ యాడ్ చేయాలనుకుంటున్నారు. దీనిపై ICC తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

News April 11, 2026

NTR: నేడు 3 మండలాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన APSDMA

image

జిల్లాలో శనివారం 3 మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. వడగాలులకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ తమ అధికారిక X ఖాతా ద్వారా తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. జి.కొండూరు 44.1, ఇబ్రహీంపట్నం 44.1, కంచికచర్ల మండలాలలో 43.3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపింది.

News April 11, 2026

‘దీపం’ లబ్ధిదారులు PNGకి మారినా రాయితీ ఇస్తాం: CM CBN

image

AP: దీపం పథకం లబ్ధిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్(PNG)కి మారినా వారికి ఇచ్చే రాయితీని ఖాతాల్లో జమ చేస్తామని CM CBN వెల్లడించారు. రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరాపై సమీక్షించిన ఆయన, రాబోయే 6 నెలల్లో 10 లక్షల PNG కనెక్షన్లు ఇవ్వాలని అధికారులకు టార్గెట్‌ను నిర్దేశించారు. శ్రీకాకుళం-కాకినాడ నేచురల్ గ్యాస్ పైప్‌లైన్ పనులు వెంటనే పూర్తయ్యేలా చూడాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిని ఫోన్‌లో కోరారు.