News May 7, 2025

ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు శుభవార్త 

image

విజయవాడ మీదుగా భువనేశ్వర్(BBS)-యశ్వంత్‌పూర్(YPR) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.02811 BBS-YPR రైలును మే 24 నుంచి జూన్ 28 వరకు ప్రతి శనివారం, నం.02812 YPR- BBS మధ్య నడిచే రైలును మే 26 నుంచి జూన్ 30 వరకు ప్రతి సోమవారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

Similar News

News February 15, 2026

నర్సంపేటలో ఢిల్లీ పోలీసుల తనిఖీలు..!

image

వరంగల్ జిల్లా నర్సంపేటలో నకిలీ కంపెనీలు సృష్టించి సుమారు రూ.2.50 కోట్లు మోసం చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందం తనిఖీలు చేపట్టింది. వేర్వేరు అడ్రస్‌లతో బ్యాంక్ ఖాతాలు తెరిచి సైబర్ ఫ్రాడ్ చేసినట్లు గుర్తించారు. నిందిత మహిళ ప్రస్తుతం హైదరాబాద్‌లో పబ్ నడుపుతున్నట్లు సమాచారం. ఆమె స్వగ్రామం లక్నేపల్లిలోని ఇంట్లో సోదాలు నిర్వహించారు.

News February 15, 2026

రష్యా ఆయిల్ ఆపేస్తామని ఇండియా హామీ ఇచ్చింది: రుబియో

image

రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోళ్లను ఆపేస్తామని ఇండియా తమకు హామీ ఇచ్చిందని US విదేశాంగ మంత్రి మార్కో రుబియో చెప్పారు. ‘రష్యా చమురుపై మరిన్ని ఆంక్షలు విధించాం. అదనపు రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను నిలిపేస్తామని చర్చల సందర్భంగా భారత్ మాటిచ్చింది’ అని మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో అన్నారు. ఇండియా తమ ఆయిల్ కొనుగోలు చేయదని ట్రంప్ తప్ప <<19115659>>ఇంకెవరూ చెప్పలేదని<<>> రష్యా విమర్శించడం తెలిసిందే.

News February 15, 2026

చల్లని నీరు Vs వేడి నీరు.. స్నానానికి ఏది బెటర్!

image

స్నానానికి వేడి నీరు బెటరా? చల్లని నీరు మేలా? అంటే రెండూ మంచివేనంటున్నారు నిపుణులు. చల్లటి నీటితో ఇమ్యూనిటీ, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయని, రక్తప్రసరణ మెరుగవుతుందని అంటున్నారు. వేడి నీళ్లతో కండరాలు రిలాక్స్ అవుతాయని, ఒత్తిడి తగ్గుతుందని పేర్కొంటున్నారు. నిద్ర ఇంప్రూవ్ అవుతుందని చెబుతున్నారు. మొత్తంగా ఉదయం చల్లటి నీళ్లు, రాత్రి గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే బెటర్ అని సూచిస్తున్నారు.