News May 7, 2025
ఎన్టీఆర్ విగ్రహం నిర్మించేది ఈ కొండ మీదే.!

అమరావతిలోని నీరుకొండలో 600 అడుగుల ఎత్తులో దివంగత NTR విగ్రహం నిర్మించనున్నారు. ఈ మేరకు విగ్రహ నిర్మాణానికి DPR కోరుతూ ఇటీవల అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ADCL) టెండర్‌లు ఆహ్వానించింది. నీరుకొండ ఎత్తు 300 అడుగులుండగా..దీనిపై 200 అడుగుల ఎత్తైన NTR విగ్రహాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసే మినీ థియేటర్‌లో NTR జీవితానికి సంబంధించిన కళాకృతులు ఉంటాయని సమాచారం.
Similar News
News February 16, 2026
TODAY HEADLINES

* T20WC: పాక్‌పై భారత్ ఘన విజయం
* జాబ్ క్రియేటర్లుగా డేటా సెంటర్లు: మోదీ
* CECపై అభిశంసనకు సిద్ధమైన విపక్షాలు
* ఏపీలో రేపు ఆప్షనల్ హాలిడే.. తెలంగాణలో నో
* కోవా బన్ను వివాదం.. బాధితుడికి లోకేశ్ మద్దతు
* రైతులకు రూ.20వేలు ఎక్కడ: YCP
* మున్సిపల్ ఫలితాలు నా పనికి గీటురాయి: రేవంత్
* TG: రేపే మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక
* TG: ఒకే విడతలో రైతుభరోసా.. 17న జమ!
News February 16, 2026
క్లోరిన్ గ్యాస్ లీకేజీపై యంత్రాగం అప్రమత్తం: కలెక్టర్

బలిజిపేట మండలం అంపావల్లిలో జరిగిన క్లోరిన్ గ్యాస్ లీకేజీ ఘటనపై జిల్లా యంత్రాంగం తక్షణమే అప్రమత్తం అయిందని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. లీకేజీ ప్రభావంతో అస్వస్తతకు గురైన ఏడుగురిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించి, వైద్యాన్ని అందించారన్నారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదన్నారు.
News February 16, 2026
మంత్రులతో సీఎం రేవంత్ జూమ్ మీటింగ్

TG: కార్పొరేషన్ మేయర్లు, మున్సిపాలిటీల ఛైర్మన్ల ఎన్నికపై సీఎం రేవంత్ మంత్రులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. రేపు వీరి ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. హంగ్ ఏర్పడిన చోట ఏ ఒక్కటి చేజారనీయొద్దని నేతలకు దిశానిర్దేశం చేశారు. మీటింగ్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి తదితరులు పాల్గొన్నారు.


