News November 20, 2025

ఎన్టీఆర్ వైద్యసేవలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: కలెక్టర్

image

డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ అమలులో నిర్లక్ష్యం వహించినా, చిన్న ఫిర్యాదు వచ్చినా సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టరు కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన వైద్య సేవలు – జిల్లా క్రమశిక్షణా కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులతో కలసి కలెక్టర్ పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.

Similar News

News January 18, 2026

బల్కంపేట్ ఎల్లమ్మకి మౌని అమావాస్య ప్రత్యేక పూజలు

image

మౌని అమావాస్య సందర్భంగా బల్కంపేట్ రేణుకా ఎల్లమ్మ తల్లిని ప్రత్యేకంగా అలంకరించారు. పలు రకాల పుష్పాలు, ఫలాలతో అమ్మవారిని అత్యంత సుందరంగా గర్భగుడిని తీర్చిదిద్దారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించి, దీప ధూప నైవేద్యాలు సమర్పించి, మంగళహారతులు ఇచ్చారు. భక్తజన సందోహంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. దర్శనానికి సుమారు 30 నిమిషాల సమయం పడుతోందని భక్తులు తెలిపారు.

News January 18, 2026

సీపీఐ 100 ఏళ్ల పండుగకు సీఎం

image

ఖమ్మంలో నేడు జరిగే సీపీఐ శతవసంతాల ముగింపు సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు బీజేఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో జరిగే సీపీఐ శతాబ్ది ఉత్సవ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. కాగా ఈ సభకు రావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం సీఎంకు ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. మిత్రపక్షం ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి సభకు వెళ్తున్నారు.

News January 18, 2026

అలంపూర్: దక్షిణ కాశీలో బ్రహ్మోత్సవ సంబరం

image

అలంపూర్ క్షేత్రంలో కొలువై ఉన్న శక్తిపీఠం శ్రీ జోగుళాంబ అమ్మవారు, శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి వారల వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయని ఆలయ ఈవో దీప్తి రెడ్డి ఆదివారం పేర్కొన్నారు. ఈనెల 19 (సోమవారం) నుంచి 23 (శుక్రవారం) వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజూ విశేష పూజలు, నిర్వహించనున్నారు. భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై స్వామివారి కృప పొందాలన్నారు.