News May 14, 2024

ఎన్టీఆర్: స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకున్న ఈవీఎంలు

image

ఎన్టీఆర్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ పూర్తవ్వడంతో ఎన్నికల కమిషన్ అధికారులు ఈవీఎంల భద్రతపై దృష్టి పెట్టారు. ఇబ్రహీంపట్నంలోని స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకున్నాయి. పోలింగ్ ముగియగానే ఈవీఎంలకు సీల్ వేసి స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు. ఈవీఎంలను రిటర్నింగ్ అధికారుల సమక్షంలో పటిష్ఠమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చారు. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర కేంద్ర, రాష్ట్ర బలగాలు మూడంచెల పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశాయి.

Similar News

News December 16, 2025

ఈ నెల 21న పల్స్ పోలియో: కలెక్టర్

image

ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ముద్రించిన పల్స్ పోలియో కార్యక్రమ గోడపత్రికలను సోమవారం ఆయన కలెక్టరేట్ లో నిర్వహించారు. చిన్నారుల బంగారు భవిష్యత్తుకై పోలియో చుక్కలు తప్పక వేయించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా. యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

News December 15, 2025

ధాన్యం సేకరణకు మిల్లర్లు సహకరించాలి: కలెక్టర్

image

రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణకు మిల్లర్లు సహకరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మిల్లర్లను కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో ధాన్యం సేకరణపై రైస్ మిల్లర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో ఈ సంవత్సరం 149 కంబైన్డ్ హార్వెస్టర్ల ద్వారా రైతులు కోతలు కోయడం వల్ల గోనె సంచులు, వాహనాల కొరత ఏర్పడిందని, మిల్లర్లు తమవంతుగా గోనె సంచులు, వాహనాలు సమకూర్చాలన్నారు.