News August 21, 2025

ఎన్టీఆర్: B.A.LL.B పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో B.A.LL.B కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ (రెగ్యులేషన్ 2018, 2023) థియరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. సెప్టెంబర్ 16, 18, 20, 23వ తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వర్శిటీ పరిధిలోని కాలేజీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని అధ్యాపకులు తెలిపారు. పూర్తి వివరాలకు https://kru.ac.in/ చూడాలని కోరారు.

Similar News

News January 12, 2026

సంగారెడ్డి: ‘ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి’

image

జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించేందుకు ఈ పాఠశాలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు.

News January 12, 2026

జగదీప్ ధన్‌ఖడ్‌కు తీవ్ర అస్వస్థత

image

మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈనెల 10న అర్ధరాత్రి 2 సార్లు స్పృహతప్పి పడిపోయారని ఆయన కార్యాలయం తెలిపింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అడ్మిట్ చేసినట్లు చెప్పింది. 2025 మార్చిలోనూ ఆయన ఛాతీ నొప్పితో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఎయిమ్స్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందించారు. అనారోగ్య కారణాలతో గతేడాది జులైలో ఉపరాష్ట్రపతి పదవికి ఆయన <<17154846>>రాజీనామా<<>> చేయడం తెలిసిందే.

News January 12, 2026

BREAKING: హనుమకొండ జిల్లాలో దారుణం

image

హనుమకొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాలు.. హసన్‌పర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన దివ్యాంగురాలు ఇంటి వద్దనే ఉంటుంది. తల్లిదండ్రులు వ్యవసాయ పని నిమిత్తం బావి వద్దకు వెళ్లారు. అది గమనించిన ఆమె దూరపు బంధువు పోలెపాక ప్రభాకర్(55) దివ్యాంగురాలిపై అత్యాచారం చేశాడు. ఈరోజు సాయంత్రం ఎల్కతుర్తిలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.