News December 1, 2025
ఎన్నికలకు భారీ బందోబస్తు: ఎస్పీ నరసింహ

జిల్లాలో మూడు విడతలుగా జరగనున్న జీపీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. ప్రతి విడతలో 1,500 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. ఎస్పీ, డీఎస్పీల ఆధ్వర్యంలో రూట్ మొబైల్స్‌తో పాటు స్ట్రైకింగ్ ఫోర్సులు రంగంలోకి దిగుతాయని స్పష్టం చేశారు. పోలింగ్ బూత్‌ల 100 మీటర్ల పరిధిలో సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎన్నికలు సజావుగా జరిగేలా చూస్తారని ఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News February 18, 2026
వయోవృద్ధులకు ప్రత్యేక కార్యక్రమాలు: కలెక్టర్

తూర్పుగోదావరి జిల్లా వయోవృద్ధుల కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం తెలిపారు. ఫిబ్రవరి 21న ధవళేశ్వరంలోని శ్రీ గేదెల నూక రాజు కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. వృద్ధులు ఉత్పాదక జీవనం గడిపేలా వర్క్‌షాపులు నిర్వహిస్తామని, జిల్లాలోని వయోవృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News February 18, 2026
టెన్త్ అర్హతతో 28,636 ఉద్యోగాలు.. BIG UPDATE

ఇండియా పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో 28,636 GDS పోస్టులకు ఈ నెల 16 వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. వీటిలో TGలో 608, APలో 1060 ఖాళీలున్నాయి. తాజాగా అప్లికేషన్ల సవరణకు అవకాశం కల్పిస్తూ పోస్టల్ శాఖ కరెక్షన్ విండోను ఓపెన్ చేసింది. అభ్యర్థులు రేపు సా.5 గంటల వరకు దరఖాస్తులను <
News February 18, 2026
కాకినాడ: దారుణం.. ఒంటిపై పెట్రోల్ పోసి..!

తునిలోని శ్రీరామ థియేటర్ సెంటర్‌లో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బైక్, సైకిల్ మెకానిక్స్ మధ్య జరిగిన గొడవ హింసాత్మకంగా మారింది. వాగ్వాదం తీవ్రం కావడంతో బైక్ మెకానిక్.. సైకిల్ మెకానిక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు PSలో లొంగిపోగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


