News May 1, 2024

ఎన్నికలకు సన్నద్ధం కావాలి: ఎంపీ అవినాశ్‌రెడ్డి

image

మే 13 జరిగే ఓటింగ్ విషయంలో ఏ చిన్న పొరపాటు చేయవద్దని వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ అవినాశ్‌రెడ్డి కార్యకర్తలకు సూచించారు. మంగళవారం స్థానిక భావసార క్షత్రియులు (రంగరాజులు), ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి అజెండా ప్రజా సంక్షేమమే అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం నేడు పెత్తందారులతో పోరాడుతున్నాడని తెలిపారు.

Similar News

News December 6, 2025

వైవీయులో పీజీ ప్రవేశాలకు 8 నుంచి స్పాట్ అడ్మిషన్లు

image

కడప: YVU P.G (ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ) కోర్సులలో నేరుగా ప్రవేశాలను ఈనెల 8 నుంచి 12వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ అఫ్ అడ్మిషన్స్ డా. టి. లక్ష్మీప్రసాద్ తెలిపారు. విద్యార్థులు బరిజనల్ సర్టిఫికెట్లు, నిర్ణీత ఫీజుతో వైవీయులోని డీవోఏ ఆఫీసులో సంప్రదించాలన్నారు. ఏపీ పీజీ సెట్ రాయని వారు కూడా రావచ్చన్నారు. వివరాలకు
yvu.edu.in ను సంప్రదించాలని సూచించారు.

News December 6, 2025

క్రికెటర్ శ్రీచరణి తండ్రికి రూ.5 లక్షల చెక్కు అందజేత

image

కడప క్రికెట్ తేజం నల్లపురెడ్డి శ్రీచరణికి జిల్లా TDP అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వ్యక్తిగతంగా ప్రకటించిన రూ.5 లక్షల ప్రోత్సాహక చెక్కును శనివారం MLA మాధవి, క్రికెట్ స్టేడియం ఛైర్మన్ శ్రావణ్ రాజ్‌రెడ్డి కలిసి ఆమె తండ్రికి అందజేశారు. మహిళా క్రికెట్ వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి కడపకు గర్వకారణమై నిలిచిన శ్రీచరణిని అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

News December 6, 2025

అన్నమయ్య కాలిబాట విషయంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం పిల్లి: శ్యామల

image

అన్నమయ్య కాలిబాటపై ఆంక్షలు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో కొమరం పులే గాని కాలిబాట విషయంలో పిఠాపురం పిల్లిలా ప్రవర్తించారని YCP రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి శ్యామల తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం నడింపల్లికి చేరుకున్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాదయాత్రకు ఆమె సంఘీభావం తెలిపారు. అనంతరం ఆమె అన్నమయ్య కాలిబాటపై ఆంక్షలు విధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని విమర్శించారు.