News December 2, 2025
ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి కలెక్టరేట్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 3 దశల్లో జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలన్నారు. ఇందుకు తగ్గట్లు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు.
Similar News
News February 19, 2026
కోడి రెక్క ఆరబెడితే గొప్ప వర్షం

వర్షం పడబోయే ముందు గాలిలో తేమ పెరగడంతో పాటు వాతావరణంలో కొన్ని మార్పులు వస్తాయి. కోళ్లు వీటిని గ్రహించి తమ రెక్కలను విరబోసుకుని (ఆరబెట్టినట్లుగా) ఆడిస్తాయట. కోళ్లు అలా ప్రవర్తిస్తే, త్వరలోనే భారీ వర్షం కురుస్తుందని గ్రామాల్లోని ప్రజలు నమ్మేవారట. దీంతో పాటు నల్ల చీమలు వరుసగా వెళ్లటం, కప్పల బెకబెకలను విని.. వ్యవసాయ పనుల కోసం సిద్ధమయ్యే రైతులు తమ ధాన్యాన్ని, ఇతర వస్తువులను భద్రపరుచుకొనేవారట.
News February 19, 2026
ప్రభుత్వానికి కాకాణి సవాల్

ఇందాపూర్ డెయిరీ వ్యవహారంపై మండలిలో చర్చకు ప్రభుత్వం భయపడుతోందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. టీటీడీ నిధులు హెరిటేజ్‌కు మళ్లించారనే అనుమానాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కల్తీ నెయ్యి ముసుగులో చంద్రబాబు రాజకీయ కుట్ర చేశారని విమర్శించారు. రాష్ట్ర అప్పులు, 22–ఏ భూముల అంశాలపై చర్చకు సిద్ధమని, ప్రభుత్వం దమ్ముంటే ముందుకు రావాలని సవాల్ విసిరారు.
News February 19, 2026
శని, మంగళవారాల్లో కొనకూడని వస్తువులు

ఈ రెండ్రోజులు నువ్వులు, గుడ్లు, ఉప్పు, మిరియాలు, చెప్పులు కొనకూడదట. శాస్త్రాల ప్రకారం ఇవి నిషిద్ధమని పండితులు చెబుతున్నారు. ‘శనివారం నాడు ఇనుము, నూనె, చెప్పులు కొంటే శని ప్రభావం పెరిగి కష్టాలొస్తాయి. ఉప్పు, మిరియాలు గొడవలకు సంకేతాలు’ అంటున్నారు. ఈ నియమాలు పాటిస్తే అనవసర ఆర్థిక నష్టాలు, గొడవలు కలగకుండా ఉంటాయని నమ్మకం. ఈ రెండ్రోజులు సాత్వికాహారం తీసుకొని దానధర్మాలు చేస్తే శుభ ఫలితాలుంటాయని నమ్మకం.


