News December 2, 2025
ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి కలెక్టరేట్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 3 దశల్లో జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలన్నారు. ఇందుకు తగ్గట్లు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు.
Similar News
News February 16, 2026
12 ఏళ్లకే వండర్ చేశాడు

Phd విద్యార్థుల కలను ఏడో తరగతి విద్యార్థి మెక్‌మిలన్(12) సాధించాడు. US డల్లాస్‌లో చిన్న ప్లేరూమ్‌లో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్‌ను నిర్మించాడు. 8 ఏళ్లకే న్యూక్లియర్ ఫిజిక్స్‌పై ఆసక్తి పెంచుకున్న చిన్నోడు ఓ సంస్థ సాయంతో ఈ ప్రాజెక్టును నిర్మించాడు. శాస్త్రీయ ఆవిష్కరణలకు వయసుతో సంబంధం లేదని చాటాడు. 2 తేలికైన పరమాణు కేంద్రకాలు కలిసి బలమైన కేంద్రకంగా మారినప్పుడు భారీగా శక్తి విడుదలవ్వడమే ఈ ప్రక్రియ.
News February 16, 2026
సిద్దిపేట: సీల్డ్ కవర్ కోసం ఎదురుచూపులు

హుస్నాబాద్, చేర్యాల, గజ్వేల్, దుబ్బాక మున్సిపల్ పాలకవర్గాలు ఈరోజు కొలువు తీరనున్నాయి. ఛైర్మన్ ఎవరనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సీల్డ్ కవర్‌లో ఎవరి పేరుందనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. హుస్నాబాద్ నుంచి దండి లక్ష్మి పేరు ఫిక్స్ అయినట్లు సమాచారం. దుబ్బాకలో శ్రీరామ్ సంగీత, బండి శీలత మధ్య పోటీ ఉంది. గజ్వేల్‌లో కళ్యాణ్కర్ పద్మాబాయి, గంగిశెట్టి చందన, చేర్యాలలో అరుణ, గీతాంజలి పేర్లు ఉన్నాయి.
News February 16, 2026
ఆదిలాబాద్: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ డివిజన్‌లో 54 ఖాళీలు ఉన్నాయి. అర్హులు నేటి సాయంత్రంలోగా indiapost.gov.inలో అప్లై చేయాలి. వేతనం వివరాలు: ☞ బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000-29,380 ☞ ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000- 24,470.


