News December 5, 2025
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: రాణి కుముదిని

సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నర్సంపేట ఆర్డీవో కార్యాలయం నుంచి కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు.
Similar News
News January 19, 2026
WGL: సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్

వరంగల్ జిల్లాలోని ప్రజావాణి వినతులకు అధికారులు వేగంగా పరిష్కారం చూపాలని కలెక్టర్ డా.సత్యశారద ఆదేశించారు. సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్‌లో ఆమె బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించి ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, జడ్పీ సీఈఓ రామ్‌రెడ్డి, ఆర్డీవోలు సుమ, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.
News January 19, 2026
వరంగల్: ఇక పట్టణాల్లో ఇందిరమ్మ చీరలు..!

గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు ఇందిరా మహిళా శక్తి పేరిట మహిళలకు ప్రభుత్వం చీరలను పంపిణీ చేసింది. ప్రస్తుతం మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పట్టణాల్లో పంపిణీ చేయడానికి సన్నాహాలు చేపట్టింది. జిల్లాలో వర్ధన్నపేట, నర్సంపేట మునిసిపాలిటీలు ఉండడంతో స్థానిక ఎమ్మెల్యేలు చీరలను పంపిణీ చేయడానికి గాను సిద్ధమయ్యారు. నోటిఫికేషన్ వెలువడక ముందే చీరల పంపిణీ పూర్తి చేయాలని నేతలు భావిస్తున్నారు.
News January 17, 2026
WGL: పరిశ్రమలతో 6,810 మందికి ఉపాధి: కలెక్టర్

వరంగల్ జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా ఇప్పటికి 48 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రూ.380.53 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు 6,810 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్న పారిశ్రామికవేత్తలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలన్నారు.


