News October 8, 2025
ఎన్నికల్లో ఆర్వోలు కీలక పాత్ర పోషించాలి: సిక్తా పట్నాయక్

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు ముఖ్య భూమిక పోషించాల్సి ఉంటుందని కలెక్టర్, ఎన్నికల అధికారి సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారుల సమావేశం నిర్వహించి వారి బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు. నామినేషన్ల ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయాలని, నామినేషన్ పత్రాలను క్షుణ్నంగా తనిఖీ చేయాలని చెప్పారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పాల్గొన్నారు.
Similar News
News January 21, 2026
SRPT: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: కలెక్టర్ తేజస్

లైసెన్స్‌డ్ సర్వేయర్లు క్షేత్రస్థాయిలో రైతులకు అపారమైన నమ్మకం కలిగేలా పనిచేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లో 45 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న మొదటి బ్యాచ్ సర్వేయర్లతో ఆయన సమావేశమయ్యారు. ధరణి, ఎల్‌ఆర్‌పీ సమస్యలకు నూతన నైపుణ్యంతో కచ్చితమైన కొలతలు వేసి, నివేదికలు అందించాలని సూచించారు. భూ రికార్డుల నిర్వహణలో జిల్లాను ఆదర్శంగా నిలపాలని కోరారు.
News January 21, 2026
NZB: KCR హయాంలో తెలంగాణ అభివృద్ధి: MP

KCR ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తించి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు BRSకు ఓటేయాలని రాజ్యసభ సభ్యుడు సురేశ్ రెడ్డి కోరారు. బుధవారం ఆర్మూర్ పట్టణంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ కోసం అనేక పోరాటాలు జరిపామని, ఇప్పుడు కూడా రాజ్యసభలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నామన్నారు.
News January 21, 2026
NLG: జిల్లా కారాగారానికి నూతన సూపరింటెండెంట్

నల్గొండ జిల్లా కారాగారానికి నూతన సూపరింటెండెంట్‌గా కె. ఆనందరావు నియమితులయ్యారు. గత సూపరింటెండెంట్ పదోన్నతిపై చర్లపల్లి కేంద్ర కారాగారానికి బదిలీ అయ్యారు. కె.ఆనందరావు గతంలో కేంద్ర కారాగారం నిజామాబాద్‌లో విధులు నిర్వహించారు. పరిపాలనా అనుభవం కలిగిన అధికారిగా గుర్తింపు పొందిన ఆయన నల్గొండ జిల్లా కారాగార అభివృద్ధికి కృషి చేస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


