News December 2, 2025
ఎన్నికల ఖర్చులకు కొత్త ఖాతా తప్పనిసరి: కలెక్టర్ తేజస్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ వివరాల నమోదు కోసం తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా తెరవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి అభ్యర్థి ప్రత్యేక ఖాతా కలిగి ఉండాలన్నారు. మూడో విడతలో నామినేషన్ వేయాలనుకునే వారు ముందుగానే కొత్త అకౌంట్ తీసుకుంటే నామినేషన్ ప్రక్రియ సులభమవుతుందని కలెక్టర్ సూచించారు.
Similar News
News February 18, 2026
ఏడుపాయలలో తప్పిపోయిన చిన్నారి.. తల్లిదండ్రుల చెంతకు

ఏడుపాయల జాతరలో తప్పిపోయిన ఐదేళ్ల బాలికను అదనపు ఎస్పీ మహేందర్ క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించి మానవీయత చాటుకున్నారు. భక్తుల రద్దీలో ఏడుస్తున్న చిన్నారిని గమనించిన ఆయన పాపకు ధైర్యం చెప్పి వివరాలు సేకరించారు. పోలీసు యంత్రాంగం సాయంతో బాలిక తల్లిదండ్రులను గుర్తించి అప్పగించారు. వేల మంది జనాల మధ్య తమ బిడ్డను క్షేమంగా చేర్చిన అదనపు ఎస్పీకి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు.
News February 18, 2026
గన్నవరం ఎయిర్‌పోర్ట్.. ఒకే రోజు 3,883 మంది ప్రయాణం!

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా మంగళవారం 40 విమాన సర్వీసులు ప్రయాణించాయని గన్నవరంలోని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వీటిలో 20 సర్వీసుల ద్వారా 2,062 మంది ఈ విమానాశ్రయంలో దిగారని, ఇక్కడ నుంచి 1,821 మంది 20 సర్వీసులలో ప్రయాణించారని తెలిపింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆయా సర్వీసుల సేవలను నిర్వహిస్తున్నామంది.
News February 18, 2026
మదనపల్లె ఘటన.. నిందితుడిని వదిలిపెట్టబోమన్న సీఎం

AP: అన్నమయ్య(D) మదనపల్లెలో <<19164033>>బాలిక హత్య<<>>పై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. చిన్నారి తల్లిదండ్రులతో ఆయనతోపాటు మంత్రులు లోకేశ్, అనిత మాట్లాడారు. నిందితుడిని వదిలిపెట్టబోమని, కఠినశిక్ష పడేలా చూస్తామని చంద్రబాబు చెప్పారు. మరోవైపు బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితుడు కులవర్ధన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


