News March 28, 2024
ఎన్నికల ప్రచారానికి అనుమతులు తప్పనిసరి: ఢిల్లీరావు

రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి ఇతర అనుమతుల మంజూరుకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అనుమతులు ఇస్తామని జిల్లా ఎన్నికల అధికారి ఢిల్లీరావు తెలియజేశారు. నేడు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అభ్యర్థులు, పార్టీలు నేరుగా లేదా ఆన్‌లైన్లో సువిధ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Similar News
News February 12, 2026
నేడు కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం

మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కొల్లు రవీంద్ర, బుద్ధప్రసాద్, బోడె ప్రసాద్, వెంకట్రావు, రాము, కృష్ణప్రసాద్, కుమార్ రాజా పాల్గొననున్నారు. కృష్ణా జిల్లా అభివృద్ధి, నియోజకవర్గాల్లో పెండింగ్ పనులు, ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. జిల్లాలో చేపట్టాల్సిన ప్రాధాన్య ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధిపై సమీక్ష జరగనుంది.
News February 12, 2026
Way2 ఎఫెక్ట్.. యానాది కుటుంబాలకు విముక్తి

నాగయలంక మండలం ఈలచెట్లదిబ్బలో యానాది కుటుంబాలతో వెట్టిచాకిరి చేపిస్తున్న ఘటనపై Way2Newsలో ‘<<19085249>>మాకు విముక్తి కల్పించండి సార్<<>>’ అనే వార్త పబ్లిష్ అయ్యింది. దీంతో స్పందించిన అధికారులు విచారణ చేసి 27 యానాది సంచార కుటుంబాలను పరిశీలించగా, 11 కుటుంబాలకు విముక్తి కల్పించి స్వగ్రామాలకు తరలించారు. అక్రమంగా తరలిస్తున్న దళారులను పోలీసులు అడ్డుకున్నారు. మిగిలిన 16 కుటుంబాలు ఇక్కడే ఉంటామని తెలిపాయి.
News February 11, 2026
రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకతే లక్ష్యం: కలెక్టర్

మచిలీపట్నంలోని ‘మీ కోసం’ వేదికగా కలెక్టర్ బాలాజీ నేతృత్వంలో రెవెన్యూ అధికారుల సమగ్ర సమీక్ష జరిగింది. జిల్లాలో రెవెన్యూ రికార్డులను పక్కాగా నిర్వహించి, ప్రజలకు మరింత జవాబుదారీగా సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా 22-ఏ వివాదాల పరిష్కారం, భూ రీ-సర్వే, ఈ-కేవైసీ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. బాధితుల నుంచి వచ్చే అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సూచించారు.


