News October 6, 2025

ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా చేయాలి: కలెక్టర్

image

ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలు కావాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి పోలీస్, రెవెన్యూ, ఎంపీడీఓ మొదలగు శాఖలకు చెందిన జిల్లా, మండల స్థాయి అధికారులతో సోమవారం గూగుల్ మీటింగ్ ద్వారా సమీక్షించి వారు మాట్లాడారు. స్థానిక సంస్థల నేపథ్యంలో జిల్లాలో మాడల్ కోడ్ పక్కాగా అమలు అయ్యేలా అధికారులు విధులను నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News January 22, 2026

హుజూర్‌నగర్: విద్యార్థులే అంబాసిడర్లు: ఎస్పీ నరసింహ

image

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా పట్టణంలోని గ్రీన్‌వుడ్ పాఠశాలలో ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కె.నరసింహ మాట్లాడుతూ.. అతివేగం, అజాగ్రత్త వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. విద్యార్థులు రోడ్డు భద్రత అంబాసిడర్లుగా మారి తల్లిదండ్రులు, ప్రజల్లో మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు.

News January 22, 2026

పెనుగంచిప్రోలు: వృద్ధురాలి నేత్రదానం.. నలుగురికి చూపు!

image

పెనుగంచిప్రోలుకు చెందిన రాజ్యలక్ష్మి (70) రోగ్యంతో గురువారం తెల్లవారుజామున మృతి చెందిన రాజ్యలక్ష్మి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే ముందు, ఆమె అవయవాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఓ ప్రముఖ ఆసుపత్రిని సంప్రదించగా, వైద్య బృందం రాజ్యలక్ష్మి నేత్రాల నుంచి కార్నియాను సేకరించారు. రాజ్యలక్ష్మి మరణించినా, ఆమె దానం చేసిన నేత్రాల ద్వారా నలుగురు అంధులకు చూపు లభించనుంది.

News January 22, 2026

రేణిగుంట ఎయిర్‌పోర్టులో భద్రత కట్టుదిట్టం

image

రిపబ్లిక్ డే సందర్భంగా రేణిగుంట విమానాశ్రయం పరిసరాల్లో భద్రతను కఠినతరం చేశారు. రెండు రోజులుగా రేణిగుంట రూరల్ పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేస్తున్నారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన రహదారులపై ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలుగా ఈ తనిఖీలు చేపట్టినట్లు సీఐ మంజునాథ్ తెలిపారు. ప్రయాణికులు సహకరించాలని కోరారు.