News February 18, 2025
ఎన్నికల విధులను సమర్ధవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల శాసన మండలి ఎన్నికల విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని అనకాపల్లి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల శాసన మండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలను స్వేచ్ఛా యుత, పారదర్శకంగా జరిగేలా చూడాలని తెలిపారు.
Similar News
News April 15, 2026
సంగారెడ్డి: ట్విన్స్.. ఫలితాల్లో ఇద్దరికి 462 మార్కులు

పుట్టుకలో వీరిద్దరూ ట్విన్స్. అయితే విద్యాభ్యాసంలో కూడా పోటీగా ఉన్నారు. అంతేకాదు ఫలితాల్లో కూడా చెరి సమానంగా మార్కులు తెచ్చుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. ఖేడ్‌కు చెందిన రవీందర్ గౌడ్ ASIగా కంగ్టిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకు మీనాయి సౌమ్య, మీనాయి మణికంఠ కవలలు. అయితే ఇంటర్ ఎంపీసీ (సంస్కృత్) ఫస్టియర్ ఫలితాల్లో చెరి సమానంగా ఇద్దరికి 462 మార్కులు వచ్చాయి. వీరి ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
News April 15, 2026
బాపట్ల జిల్లాకు నిధులు

పల్నాడు, బాపట్ల జిల్లాల్లో దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించింది. పల్నాడులోని 35 రోడ్లకు రూ.69.91 కోట్లు, బాపట్లలోని 44 రోడ్లకు రూ.60.61కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను ఏడాదిన్నరలో పూర్తి చేయాలని టెండర్లు పిలిచింది. గత ఐదేళ్లుగా ఈ రోడ్లు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. అయితే, రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాలకు నిధులిచ్చిన ప్రభుత్వం గుంటూరును మాత్రం విస్మరించింది.