News December 2, 2025
ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్ తేజస్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్లు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో విధులు నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రిటర్నింగ్ ఆఫీసర్లకు పూర్తి బాధ్యత ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News February 13, 2026
చీరాల: దొంగతనం కేసులో నిందితుడికి జైలు శిక్ష

చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2018లో జరిగిన దొంగతనం కేసులో నిందితుడు బాలరాజుకు చీరాల పీజేసీజే కోర్టు జైలు శిక్షను నేడు విధించింది. దొంగతనం చేసినట్లు రుజువడంతో 8 నెలలు సాధారణ జైలు శిక్షతో పాటు రూ.100 జరిమానా విధించింది. కేసు విచారణలో కృషి చేసిన SHO, ఏపీపీ పద్మారెడ్డి, కోర్టు సిబ్బందిని జిల్లా SP జి. ఉమామహేశ్వర్ IPS అభినందించారు.
News February 13, 2026
మహాశివరాత్రి రోజు నాన్-వెజ్ అమ్మకాలపై నిషేధం

మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15న (ఆదివారం) బెంగళూరులో జంతు వధ, మాంసం అమ్మకాలను నిషేధిస్తూ గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) ఆదేశాలు జారీ చేసింది. అథారిటీ పరిధిలోని అన్ని చికెన్, మటన్, చేపల దుకాణాలు, కబేళాలను ఆ రోజు 24 గంటల పాటు మూసేయాలని ఆదేశించింది. సాంస్కృతిక ఆచారాలు, మతపరమైన సెంటిమెంట్ల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.
News February 13, 2026
మేడారం ఈ హుండీ ఆదాయం రూ.21,36,607

మేడారం జాతర ఆదాయ వివరాలను అధికారులు వెల్లడించారు. తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ-హుండీ విధానం ద్వారా రూ.21,36,607 ఆదాయం లభించింది. సంప్రదాయ హుండీల ద్వారా వచ్చిన రూ.13,25,83,269తో కలుపుకొని మొత్తం ఆదాయం రూ.13,47,19,876కు చేరింది. గత జాతర ఆదాయం (రూ.13,25,22,511)తో పోలిస్తే ఈసారి రూ.21,97,365 లక్షల అదనపు ఆదాయం సమకూరింది. నెట్‌వర్క్ సమస్యల వల్ల ఈ-హుండీ ఆదాయం కొంత మేర తగ్గిందని అధికారులు అభిప్రాయపడ్డారు.


