News December 2, 2025
ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్ తేజస్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్లు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో విధులు నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రిటర్నింగ్ ఆఫీసర్లకు పూర్తి బాధ్యత ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News February 18, 2026
కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ కీలక నిర్ణయం

కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ అధికారిక కమ్యూనికేషన్ వ్యవస్థలో కీలక మార్పులు చేసినట్లు SP రాజేశ్ చంద్ర ప్రకటించారు. సమాచార భద్రతను పటిష్ఠం చేయడంలో భాగంగా ఇప్పటి వరకు వాడుకలో ఉన్న జీమెయిల్ ఐడీలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వీటికి ప్రత్యామ్నాయంగా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వారి సురక్షితమైన @tspolice.gov.in ఈమెయిల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
News February 18, 2026
జిల్లాలో 52వేల మందికి టీబీ పరీక్షలు: DMHO వెంకటరమణ

జిల్లాను క్షయ రహితంగా మార్చేందుకు వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ పెండెం వెంకటరమణ పిలుపునిచ్చారు. బుధవారం నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 52,000 మందికి టీబీ పరీక్షలు చేయగా, 765 మందికి చికిత్స అందిస్తున్నామన్నారు. లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, ఆధునిక సాంకేతికతతో త్వరితగతిన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
News February 18, 2026
అశ్వ వాహనంపై ఆదిదంపతులు

శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఉత్సవాల చివరి రోజున శివపార్వతులు అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రికి పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవ కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా ముగియనున్నాయి.


