News December 2, 2025
ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్ తేజస్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్లు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో విధులు నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రిటర్నింగ్ ఆఫీసర్లకు పూర్తి బాధ్యత ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News February 18, 2026
కాసేపట్లో విజయవాడలో పర్యటించనున్న YS జగన్

మాజీ CM YS జగన్ మరికాసేపట్లో విజయవాడలోని గొల్లపూడిలో పర్యటించనున్నారు. YCP MLC తలశిల రఘురాం తండ్రి చంద్రశేఖరరావు మృతి చెందడంతో కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపేందుకు 11:30 గంటలకు గొల్లపూడిలోని రఘురాం నివాసానికి వస్తారు. ఆయన వెంట ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలు రానున్నట్లు అధికారికంగా సమాచారం వెలువడింది.
News February 18, 2026
NLG: రేపటి వరకు రేషన్ బియ్యం పంపిణీ

రేషన్ బియ్యం ఈ నెల 19వ తేదీ వరకు సరఫరా చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాసన రఘునందన్ తెలిపారు. ఇప్పటివరకు రేషన్ తీసుకోని లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏదైనా కారణాలతో రేషన్ తీసుకోని వారికి అవకాశం ఉందని తెలిపారు.
News February 18, 2026
FSLలో కొలువులు.. NOTIFICATION వచ్చేసింది..!

TG ఫోరెన్సిక్ ల్యాబ్(FSL) ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు గమనిక. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తిచేసుకున్న వారిలో 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను రాతపరీక్షలకు ఎంపిక చేశారు. MAR 5,6,7 తేదీల్లో మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో పరీక్షలు జరగనున్నాయి. షార్ట్ లిస్ట్ కానివారు రూ.500 ఫీజు చెల్లించి FEB 21వ తేదీ ఉదయం 8గంటల వరకు ఆన్‌లైన్‌లో తమ అభ్యంతరాలు తెలపవచ్చు. హాల్ టికెట్ల వివరాలు త్వరలో వెల్లడిస్తారు.


