News October 8, 2025
ఎన్నికల విధులు సమర్థంగా నిర్వహించాలి: కలెక్టర్

భద్రాద్రి: స్థానిక సంస్థల ఎన్నికల విధులను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి జిల్లా ఎన్నికల నోడల్ అధికారులతో ఆయన వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఎన్నికల ప్రక్రియ నిర్వహణపై అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్‌తో కలిసి ఆయన చర్చించారు.
Similar News
News January 18, 2026
కరీంనగర్ జిల్లాలో వార్డుల రిజర్వేషన్లు పూర్తి

KNR జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్ సహా జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రిజర్వేషన్లను శనివారం ఖరారు చేశారు. కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ పమేలా సత్పతి లాటరీ పద్ధతిన ఈ ప్రక్రియ నిర్వహించారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ కేటగిరీల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా వార్డులను కేటాయించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
News January 18, 2026
SRCL: రాజకీయ పార్టీల సమక్షంలో రిజర్వేషన్ల ఖరారు

జిల్లాలోని మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రాజకీయ పార్టీల రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు మున్సిపల్ వార్డుల్లో రిజర్వేషన్ ఖరారు చేసే ప్రక్రియను శనివారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇంచార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు.
News January 18, 2026
గచ్చిబౌలిలో కనువిందు చేసిన డ్రోన్ ఫెస్టివల్

గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ‘డ్రోన్ ఫెస్టివల్ 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ప్రదర్శనను వీక్షించేందుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు. ఈ డ్రోన్ షోలో రామప్ప దేవాలయం, గోల్కొండ కోట, చార్మినార్, పాలపిట్ట వంటి తెలంగాణ చిహ్నాలను ప్రదర్శించారు. ఆకాశంలో డ్రోన్లు చేసిన విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సంస్థ ఎండీ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు.


