News April 29, 2024

ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దు: ఎన్నికల పరిశీలకులు

image

ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దని,
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని
ఎన్నికల పరిశీలకుడు సమీర్ మాధవ్ కుర్కోటి సూచించారు. ఎన్నికల నియమావళిపై అదివారం మెదక్ కలెక్టరేట్లో వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్షి, జిల్లా పోలీస్ పరిశీలకుడు రామేశ్వర్ సింగ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్, SP బాలస్వామితో కలిసి జిల్లా ఎన్నికల నోడల్ అధికారులు, పోలీస్ అధికారులతో సమీక్షించారు.

Similar News

News April 13, 2026

జనగణన నియామకాలు పూర్తి: కలెక్టర్ ప్రతిమా సింగ్

image

జిల్లాలో జరగనున్న జనగణన కార్యక్రమానికి అవసరమైన సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్ల నియామక ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి కులగణన సంచాలకులు భారతి హోలికేరి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ నెల 26 నుంచి మే 10 వరకు చేపట్టే ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

News April 13, 2026

MDK: రాత్రికి నీటి విడుదల.. ప్రజలు జాగ్రత్త

image

ఇవాళ రాత్రి 8 గంటల నుంచి మంజీరా బ్యారేజ్ నుంచి ఘనపూర్ ఆనికట్‌కు 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. సెకనుకు 1,070 క్యూసెక్కుల చొప్పున నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే సునీతా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా విజ్ఞప్తి చేశారు. నదీ ప్రవాహానికి ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ప్రజలకు అవగాహన కల్పించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News April 13, 2026

మెదక్ జల్లాలో 18వ శతాబ్దపు తెలుగు శాసనం గుర్తింపు

image

మెదక్ జిల్లా వరిగుంతం గ్రామంలో బుర్ర సంతోష్ 18వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనాన్ని గుర్తించారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ పరిశీలించి, ఇది ఎఱయప్రోలు పేరు మీద ఇచ్చిన దానం గురించి తెలుపుతుందని నిర్ధారించారు. గ్రామం యొక్క పురాతన చరిత్రకు నిదర్శనమైన ఇటువంటి శాసనాలను, విగ్రహాలను భావి తరాల కోసం ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.