News May 1, 2024

ఎన్నికల విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపిలోల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. ఖమ్మంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పాలేరు, మధిర, సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ల పీవో, ఏపీవో, ఓపిలో లకు చేపట్టిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణలో వీరి పాత్ర కీలకమని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా వారి సలహాలు సూచనలు చేసారు.

Similar News

News December 7, 2025

మూడో విడత ఎన్నికలు.. 906 నామినేషన్లు ఆమోదం

image

ఖమ్మం జిల్లాలోని మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 7 మండలాల్లో దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియను శనివారం అధికారులు పూర్తి చేశారు. ఇందులో సర్పంచ్ 906, వార్డుల స్థానాలకు దాఖలైన 4010 నామినేషన్లను ఆమోదించినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈనెల 9న మధ్యాహ్నం 3 లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత బరిలో నిలిచే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తామని పేర్కొన్నారు.

News December 7, 2025

రెండో విడత ఎన్నికలు.. 23 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

image

ఖమ్మం జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 6 మండలాల్లో 23 సర్పంచ్, 306 వార్డులు స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు. కామేపల్లి S-6 W-67, ఖమ్మం రూరల్ S-2 W-22, కూసుమంచి S-6 W-87, ముదిగొండ S-1 W-27, నేలకొండపల్లి S-3 W-50, తిరుమలాయపాలెం S-5 W-53 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాగా 6 మండలాల్లో మిగిలిన 160 సర్పంచ్, 1380 వార్డు స్థానాలకు ఈనెల 14న ఎన్నిక జరగనుంది.

News December 7, 2025

ఏకగ్రీవ పంచాయతీలలోనూ ఎన్నికల కోడ్ అమలు: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్) అమలులో ఉంటుందని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ స్పష్టం చేశారు. ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలలో సైతం ఈ ఎన్నికల కోడ్ తప్పనిసరిగా అమలులో ఉంటుందని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై ఎన్నికలకు దూరమయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.