News November 19, 2025

ఎన్ కౌంటర్‌లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

image

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.

Similar News

News January 20, 2026

SKLM: తొలి రోజు హెలికాప్టర్ రైడ్‌లో ఎంత మంది విహరించారంటే..

image

రథసప్తమి సందర్భంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్‌ను సిక్కోలు వాసులు ఆస్వాదిస్తున్నారు. సోమవారం ప్రారంభమైన తొలి రోజు దాదాపు 107 మంది హెలికాప్టర్‌లో విహరించగా రూ.2,43,400 వసూలయ్యాయి. హెలికాప్టర్ రైడర్లకు ప్రత్యేకంగా స్వామి వారి చిన్న విగ్రహం, ప్రసాదాన్ని అందజేస్తున్నారు. డచ్ బంగ్లా వద్ద ప్రత్యేకంగా బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. రూ.2,200 చెల్లించి టికెట్ తీసుకోవాలి.

News January 20, 2026

శ్రీకాకుళం: జిల్లాలో 57 ఉద్యోగాలకు నేడే లాస్ట్!

image

శ్రీకాకుళం జిల్లాలో కస్తూర్భాగాందీ బాలికల విద్యాలయాల్లో(KGVB) మొత్తం 57 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు నేటితో ముగియనుంది. ఈనెల 11నే గడువు ముగియగా 20వ తేదీకి పెంచారు. టైప్-3లో 30, టైప్-4 కేజీబీవీల్లో 27 పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు 18 ఏళ్ల వయసు కలిగినవారు మాత్రమే అప్లికేషన్లను జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.

News January 20, 2026

పకడ్బందీగా ఇంటర్మీడియట్ పరీక్షలు: SKLM కలెక్టర్

image

జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఆర్టీసీ, ఆరోగ్య శాఖల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా థియరీ పరీక్షలకు 39,383 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, 71 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.