News December 1, 2025

ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలియజేయండి: గొట్టిపాటి

image

AP: ‘దిత్వా’ తుఫాను వేళ విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవి ఆదేశించారు. దక్షిణ కోస్తా, రాయలసీమ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలి. గత అనుభవాల దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. పరిస్థితిని ఎప్పటికప్పుడు నాకు తెలియజేయండి’ అని మంత్రి తెలిపారు.

Similar News

News February 17, 2026

ఏడుపాయల జాతర.. సేపట్లో రథోత్సవం

image

ఏడుపాయల వనదుర్గా భవాని మాత జాతర ముగింపు దశకు చేరుకుంది. జాతరలో ప్రధాన ఘట్టమైన రథోత్సవానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. గర్భగుడిలో ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో రథం వద్దకు చేర్చారు. ఆనవాయితీ ప్రకారం నాగసాన్‌పల్లి వతందారులు ఈ ప్రక్రియను నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో రథోత్సవం ప్రారంభం కానుంది.

News February 17, 2026

రేపటి నుంచి శనగల కొనుగోళ్లు.. 15 రోజుల్లో డబ్బులు: మంత్రి

image

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి శనగల కొనుగోళ్లను ప్రారంభిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతులు తమ పంటను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. CM APP ద్వారా షెడ్యూల్ ప్రకారం కొనుగోళ్లు చేపడతామన్నారు. 15 రోజుల్లోపు అన్నదాతల అకౌంట్లకే డబ్బులు జమ చేస్తామని భరోసా ఇచ్చారు. కాగా 2026-27 రబీ సీజన్‌కు కేంద్రం క్వింటాకు రూ.5,875 మద్దతు ధర ప్రకటించిన విషయం తెలిసిందే.

News February 17, 2026

హీరో తండ్రి కన్నుమూత

image

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి సునీల్ మల్హోత్రా కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 14న మరణించగా తాజాగా ఆ వార్త బయటకు వచ్చింది. ఢిల్లీలో కుటుంబసభ్యుల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. దీనికి సిద్ధార్థ్, ఆయన భార్య కియారా అద్వాణీ హాజరయ్యారు. సునీల్ గతంలో మర్చంట్ నేవీ కెప్టెన్‌గా పని చేశారు.