News February 19, 2025
ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మకే టీడీపీ మద్దతు: ఎంపీ

కష్టకాలంలో నిలబడ్డవారికి సపోర్ట్ చేయాలని విశాఖ MP శ్రీభరత్ అన్నారు. ఉత్తరాంధ్ర టీచర్ MLC ఎన్నికల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆదేశానుసారం ప్రస్తుత MLC రఘువర్మకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. జనసేన కూడా మద్దతు తెలిపిందని బీజేపీతో చర్చిస్తామని వెల్లడించారు. కాగా.. గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల సమయంలో TDP బలపరిచిన వేపాడ చిరంజీవి గెలుపులో రఘువర్మ కీలక పాత్ర పోషించారు.
Similar News
News March 27, 2025
విజయనగరం జిల్లాపై సీఎం స్పెషల్ ఫోకస్

విజయనగరం జిల్లాలో సాగునీటి కష్టాలు తీరనున్నాయి. ప్రధాన ప్రాజెక్టులైన తోటపల్లికి రూ.105కోట్లు, తారకరామసాగర్‌కు రూ.807కోట్లు ఇవ్వనున్నట్లు CM చంద్రబాబు ప్రకటించారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో జిల్లాలోని సాగునీటి వనరులపై CM ఆరా తీశారు. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే సెంట్రల్ ట్రైబుల్ యునివర్సిటీకి రూ.29కోట్లు ఇస్తామన్నారు.
News March 27, 2025
VZM: ‘ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నాం’

ఖరీఫ్ 2024-25 సీజన్‌కు గాను జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరుకున్నందున ఈనెల 31న కేంద్రాలను మూసి వేస్తున్నామని కలెక్టర్ అంబేడ్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 487 కేంద్రాల నుంచి 3.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రైతుల ఖాతాల్లో మద్దతు ధర రూ.768 కోట్లు, GLT చెల్లింపులకు రూ.12కోట్లు జమ చేశామన్నారు. రైతులు వద్ద ధాన్యం ఉంటే నిర్ణీత గడువులోగా విక్రయించాలన్నారు.
News March 27, 2025
VZM: పర్యాటక రంగంలో జిల్లా ఆదాయాన్ని పెంచుతాం: కలెక్టర్

విజయనగరం జిల్లాలో పైడితల్లి ఆలయంతో పాటు రామతీర్ధాన్ని పర్యాటక ఆధ్యాత్మిక క్షేత్రాలుగా అభివృద్ధి చేసి జిల్లాలో ఆదాయం పెంచుతామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. అమరావతిలో బుధవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ఈ అంశాన్ని ప్రస్థావించారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వస్తున్న దృష్ట్యా ఉపాధి అవకాశాలు, ఆతిధ్య రంగం అభివృద్ధిలో భాగంగా వాణిజ్యం, హోటళ్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామన్నారు.