News February 6, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలపై బాపట్ల కలెక్టర్ సూచనలు

image

ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని బాపట్ల కలెక్టర్ జె.వెంకట మురళి నోడల్ ఆఫీసర్లను ఆదేశించారు. బాపట్ల కలెక్టరేట్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు 12 మండలాల్లో జరుగుతాయన్నారు. ASP విఠలేశ్వర్ పాల్గొన్నారు.

Similar News

News January 22, 2026

GHMC కమిషనర్ కొత్త ఆఫీస్‌లు ఎక్కడో తెలుసా?

image

ఫిబ్రవరి 10 తర్వాత GHMC 3 కార్పొరేషన్లు (హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి)గా విడిపోనుంది. దీంతో కొత్త కార్పొరేషన్ల కార్యాలయాలు ఈ ప్రాంతాల్లో ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న GHMC కార్యాలయంలోనే హైదరాబాద్, తార్నాక పాత HMDA కార్యాలయంలో మల్కాజిగిరి, మాదాపూర్‌లోని నేషనల్ అకాడమి ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAC) బిల్డింగ్‌లో సైబరాబాద్ కార్పొరేషన్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నట్లు తెలిసింది.

News January 22, 2026

గిల్ డకౌట్.. సర్ఫరాజ్ సెంచరీ

image

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ అనంతరం రంజీ ట్రోఫీలో ఆడుతున్న టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ నిరాశపరిచారు. సౌరాష్ట్రతో మ్యాచులో ఈ పంజాబ్ బ్యాటర్ 2 బాల్స్ మాత్రమే ఆడి డకౌట్ అయ్యారు. మరోవైపు డొమెస్టిక్ క్రికెట్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న ముంబై ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ హైదరాబాద్‌పై సెంచరీ బాదారు. ఇందులో 9 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి.

News January 22, 2026

భద్రాద్రి: విద్యార్థుల చదువుల స్థాయిపై కలెక్టర్ అసంతృప్తి

image

ఆళ్లపల్లి మండలం మర్కోడు గ్రామంలోని బాలుర ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం సందర్శించారు. విద్యార్థుల చదువు స్థాయిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వారికి అవసరమైన మౌలిక వసతులు తక్షణమే కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనవసర ఖర్చులు చేయకుండా విద్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం ఎంపీపీఎస్ నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించి వారంలోగా పూర్తి చేయాలన్నారు.