News May 4, 2024
ఎమ్మెల్సీ నామినేషన్లు షురూ

ఒక వైపు పార్లమెంట్ ఎన్నికల హోరు కొనసాగుతుండగా.. ఇప్పుడు NLG – WGL-KMM పట్టభద్రుల MLC ఎన్నిక హడావుడి కూడా మొదలైంది. ఈ నెల 27న జరిగే MLC ఎన్నిక పోలింగ్ జరగనుంది. 2 నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న)ను ప్రకటించగా, బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా వరంగల్‌కు చెందిన ఏనుగు రాకేష్ రెడ్డి ని ప్రకటించింది. బీజేపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు.
Similar News
News December 15, 2025
MLG: రెండో విడతలో తగ్గిన పోలింగ్ శాతం

మొదటి విడతలో కంటే రెండో విడతలో స్వల్పంగా పోలింగ్ శాతం తగ్గింది. మొదటి విడతలో NLG, CDR రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 14 మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 90.53 శాతం పోలింగ్ నమోదు కాగా రెండో విడతలో MLG డివిజన్ లోని 10 మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 88.74 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. రెండో విడత పోలింగ్‌లో అత్యధికంగా మాడుగులపల్లి మండలంలో 92.34 శాతం పోలింగ్ నమోదు కాగా, మిర్యాలగూడలో 85.79 శాతం పోలింగ్ నమోదైంది.
News December 15, 2025
పెద్దవూర: మూడు ఓట్లతో ఇండిపెండెంట్ విజయం

పెద్దవూర మండలం సంగారం గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇండిపెంటెండ్ ఈసం రమేష్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ బలపరిచిన మాతంగి శ్రీనయ్య మీద 3 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తన మీద నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధితో పాటు గ్రామానికి సేవ చేస్తా అని అన్నారు.
News December 14, 2025
త్రిపురారం: రాష్ట్రంలోనే చిన్న పంచాయతీ.. ఎవరు గెలిచారంటే..

బృందావనపురం సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన మందడి రమణారెడ్డి విజయం సాధించారు. తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ బలపరిచిన వంగాల శ్రీనివాస్ రెడ్డిపై ఏడు ఓట్ల తేడాతో రమణారెడ్డి విజయం సాధించారు. రమణారెడ్డి విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు, మద్దతుదారులు సంబరాలు జరుపుకుంటున్నారు. బృందావనపురం గ్రామపంచాయతీ రాష్ట్రంలోనే అతి చిన్న గ్రామపంచాయతీ కావడం విశేషం. ఇక్కడ కేవలం 98 ఓట్లు మాత్రమే ఉన్నాయి.


