News December 1, 2025
ఎయిడ్స్ నియంత్రణలో కామారెడ్డి జిల్లాకు ద్వితీయ స్థానం

కామారెడ్డి జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణలో 2025-26 సంవత్సరానికి ద్వితీయ స్థానం లభించిందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో కామారెడ్డి ART సెంటర్ ద్వారా 2,570, బాన్సువాడ ART ద్వారా 1,411 మంది బాధితులకు వైద్య సేవలందుతున్నాయి. NGOల సహకారంతో, లింక్ వర్కర్‌ల సహాయంతో పాజిటివ్ కేసులు గుర్తిస్తున్నారు.
Similar News
News February 11, 2026
HYD: ‘అ’క్షరం.. ‘ఆ’కలి దుఃఖంలో కలిశాయి!

పాఠశాల ముగియగానే పిల్లలు గంతులేసుకుంటూ ఇళ్లకు వెళ్లి ఆడుకుంటారు. కానీ, మాదాపూర్‌లోని ఈ చిన్నారి కథ వేరు. స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్లకుండా, నేరుగా తల్లి కూర్చునే ఫుట్‌పాత్ వద్దకు వెళ్తుందా పాప. చెప్పులు కుట్టడంలో తల్లికి సాయం చేస్తూ, కస్టమర్లు లేని సమయంలో హోంవర్క్ రాస్తోంది. చదవడానికి ఇంట్లో కనీస వసతులు లేకపోయినా, వీధి దీపాల వెలుతురులో చదువుతోంది. ఈ బుజ్జితల్లి ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుకుందాం.
News February 11, 2026
SRPT: ఓటు వేయడానికి తరలిరండి: కలెక్టర్

మున్సిపాలిటీలో ఎన్నికలలో ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించు కోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు బాధ్యతగా ఉండాలని, పార్టీలతో సంబంధం లేకుండా మంచి వ్యక్తులను ఎన్నుకోవాలన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన పోలింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
News February 11, 2026
HYD: ‘అ’క్షరం.. ‘ఆ’కలి దుఃఖంలో కలిశాయి!

పాఠశాల ముగియగానే పిల్లలు గంతులేసుకుంటూ ఇళ్లకు వెళ్లి ఆడుకుంటారు. కానీ, ఈ చిన్నారి కథ వేరు. స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్లకుండా, మాదాపూర్‌లోని BIG C ముందు తల్లి కూర్చునే ఫుట్‌పాత్ వద్దకు వెళ్తుందా పాప. చెప్పులు కుట్టడంలో తల్లికి సాయం చేస్తూ, కస్టమర్లులేని సమయంలో హోంవర్క్ రాస్తోంది. చదవడానికి ఇంట్లో కనీస వసతులు లేకపోయినా, వీధి దీపాల వెలుతురులో చదువుతోంది. ఈ బుజ్జితల్లి ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుకుందాం.


